టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏగా పనిచేసిన చిన్న అప్పన్నపై సిట్ కీలక అభియోగాలు నమోదు చేసింది. ఏపీ భవన్‌లో లైజనింగ్ ఆఫీసర్‌గా ఉంటూనే టీటీడీ వ్యవహారాల్లో చక్రం తిప్పినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. అధికారిక హోదా లేకపోయినా, టీటీడీకి సంబంధించిన కీలక నిర్ణయాలు, సరఫరాలపై చిన్న అప్పన్న ప్రభావం చూపినట్లు ఛార్జిషీట్‌లో స్పష్టం చేసింది.
వైవీ సుబ్బారెడ్డి అధికారిక లెటర్‌హెడ్‌పై చిన్న అప్పన్న ఫోన్ నెంబర్ ఉండటమే ప్రధాన ఆధారంగా సిట్ పేర్కొంది. దీనివల్లే అతడు వైవీ సుబ్బారెడ్డి పీఏగానే వ్యవహరించాడని నిర్ధారణకు వచ్చామని దర్యాప్తు అధికారులు తెలిపారు. ముఖ్యంగా నెయ్యి సరఫరా చేసే కంపెనీల నుంచి కిలోకు రూ.25 చొప్పున కమీషన్లు వసూలు చేసినట్లు సిట్ గుర్తించింది.
ఈ కమీషన్ల రూపంలో చిన్న అప్పన్న ఖాతాలో మొత్తం రూ.4.6 కోట్లు జమ అయినట్లు బ్యాంకు లావాదేవీల ఆధారంగా సిట్ నిర్ధారించింది. నెయ్యి సరఫరా టెండర్లు, చెల్లింపుల సమయంలో కంపెనీలపై ఒత్తిడి తెచ్చి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు అభియోగాలు మోపింది.
ఈ కేసులో తనకు చిన్న అప్పన్న పీఏ కాదని వైవీ సుబ్బారెడ్డి చేసిన వాదనను సిట్ పూర్తిగా కొట్టివేసింది. అందుబాటులో ఉన్న పత్రాలు, కాల్ రికార్డులు, లావాదేవీల ఆధారంగా చిన్న అప్పన్న వైవీ సుబ్బారెడ్డి పీఏగానే వ్యవహరించాడని ఛార్జిషీట్‌లో స్పష్టంగా పేర్కొంది. ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.
Also Read:ఎన్నికల ప్రచారం..మాజీ మంత్రి హరీష్ రికార్డ్

