కువైట్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాల్సిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. కువైట్‌లో నుంచి అర్ధరాత్రి 1:30 గంటలకు బయలుదేరిన ఈ ఇండిగో విమానం ఉదయం 8:10కు శంషాబాద్ చేరుకోవాల్సి ఉంది. అయితే, విమానంలో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తి ఇండిగో అధికారులకు ఈమెయిల్ పంపడంతో వెంటనే అప్రమత్తం అయ్యారు.
అత్యంత జాగ్రత్త చర్యగా విమానాన్ని మధ్యలోనే ముంబై ఎయిర్‌పోర్ట్‌కు దారి మళ్లించారు. ముంబైలో ల్యాండింగ్‌కు ముందు పైలట్ మరియు సిబ్బంది అత్యవసర భద్రతా ప్రోటోకాల్‌ను అమలు చేశారు. బాంబు బెదిరింపు సమాచారం పైలట్‌కి చేరడంతో కొంతసేపు విమానంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రయాణికులు భయాందోళనకు గురైనా, సిబ్బంది అందరికీ ధైర్యం చెప్పి పరిస్థితిని నియంత్రించారు.
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్ చేసిన వెంటనే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, CISF, స్థానిక పోలీసు బృందాలు అక్కడికి చేరుకుని విమానాన్ని పూర్తిగా తనిఖీ చేస్తున్నాయి. ఇది నిజమైన బెదిరింపో, లేక తప్పుడు అలర్ట్‌నో తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు చేపట్టారు.ప్రయాణికులందరిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చి ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రాంతానికి తరలించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read:ఓట్ల కోసం సీఎం రేవంత్ కోడ్ ఉల్లంఘన

