BB9:తనూజ వర్సెస్ డీమాన్-కళ్యాణ్

10
- Advertisement -

బిగ్‌బాస్ ఈ వారం నామినేషన్స్‌లో ప్రతి ఒక్కరికీ ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు. నామినేషన్ సూచనగా సీసా పగలగొట్టాలి. తనూజకి ఛాన్స్ రాగానే ఆమె భావోద్వేగంగా ఇమ్మానుయేల్ గురించి మాట్లాడింది.

“బిగ్‌బాస్ 9కి రాకముందు నాకు మీరందరూ కొత్త ముఖాలు. ఇమ్మూతో ఒక నెల ఫ్రెండ్‌షిప్ ఉంది. హౌస్‌లో నేను ఎలా ఆడతానో భయం వేసింది. ‘నెను ఉన్నా’ అని నన్ను నెమ్మదిపెట్టాడు. కానీ ఇక్కడ ఏదైనా అనిపిస్తే షేర్ చేసుకున్నప్పుడు ప్రతిసారి నన్నే నామినేషన్‌లోకి లాగాడు,” అంటూ తనూజ కన్నీళ్లు పెట్టుకుంది. భరణి తర్వాత తనకు క్లోజ్ అయిన వ్యక్తి ఇమ్మానుయేలే అని చెప్పిన ఆమె, “ఒక మాట అన్నానని ఫ్రెండ్‌ను విసరేయొద్దు. నువ్వు నా ఫ్రెండే,” అని చెప్పి క్షమాపణ కోరింది.

ఇమ్మానుయేల్ కూడా భావోద్వేగపూర్వకంగా స్పందిస్తూ, “నిన్ను ఎంత ట్రూగా ఫీలయ్యావో నేనూ అలాగే ఉన్నాను. మూడు వారాలు నిన్ను ఎక్కడా వదిలిపెట్టలేదు. ‘నన్ను నాన్న తప్ప ఎవరూ సపోర్ట్ చేయరు’ అన్నప్పుడు నేను హర్ట్ అయ్యాను,” అన్నాడు. ఇంకా, “నిన్ను ఫ్రెండ్ అనుకున్నాను కాబట్టి నీ మాటలు నన్ను బాధపెట్టాయి,” అంటూ అతడూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

తర్వాత తనూజ, “టీవీలో ఎవరో కట్టప్ప, మహానటి అన్నారు కాబట్టి నన్ను రీజన్ లేకుండా నామినేట్ చేశావ్,” అని తన కారణం చెప్పింది. వెంటనే బిగ్‌బాస్ దీనికి క్లారిఫికేషన్ ఇచ్చి నామినేషన్‌కు సంబంధించిన విషయాలకే పరిమితం కావాలని హెచ్చరించాడు. అంతట తనూజ తన ఫస్ట్ నామినేషన్ పవన్ అని చెప్పడంతో హౌస్ షాక్ అయ్యింది.

తర్వాత డీమాన్ అవకాశం వచ్చినప్పుడు తనూజను నామినేట్ చేస్తూ, “నామినేషన్ సమయంలో పర్సనల్ విషయాలు పెడితే నాకిష్టం లేదు. నీకు సపోర్ట్ అంతా ఉందని చెప్తావ్ – అది నా రెండో పాయింట్,” అన్నాడు. దీనికి తనూజ మరోసారి టాపిక్ మార్చడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది.

చివరిగా తనూజ ముందే సీసా బద్దలుకొట్టుకోవడంతో మరోసారి డీమాన్ కూడా అధికారికంగా ఆమె నెత్తిన సీసా కొట్టి నామినేషన్ పూర్తి చేశాడు.

Also Read:ఓట్ల కోసం సీఎం రేవంత్ కోడ్ ఉల్లంఘన

- Advertisement -