పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం OGలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు అర్జున్ దాస్. అతని గంభీరమైన స్వరం, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఇటీవల అర్జున్ దాస్ నటించిన తమిళ చిత్రం Bombలో శివాత్మిక రాజశేఖర్ కథానాయికగా నటించింది.
ఈ సినిమా విమర్శకుల నుండి అద్భుతమైన సమీక్షలను అందుకున్నప్పటికీ, ఆ ప్రశంసలు థియేటర్ కలెక్షన్‌లుగా మారలేదు. తాజా సమాచారం ప్రకారం, Bomb చిత్రం అక్టోబర్ 10నుంచి Aha Tamilలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. థియేట్రికల్ విండో నాలుగు వారాలుగా నిర్ణయించబడింది.
విశాల్ వెంకట్ దర్శకత్వం వహించిన ఈ మేజికల్ రియలిజం సోషల్ డ్రామాను సుధా సుకుమార్ మరియు సుకుమార్ బాలకృష్ణన్ కలిసి జెంబ్రియో పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు. కాళీ వెంకట్, నాసర్, అభిరామి, సింగంపూలి ఇతర కీలక పాత్రల్లో నటించారు. డి. ఇమ్మాన్ సంగీతం అందించారు.
Also Read:ఏపీకి భారీ వర్ష సూచన

