నెట్‌ఫ్లిక్స్‌లో వార్ 2!

7
- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన యాష్ రాజ్ ఫిలిమ్స్ (YRF) భారీ యాక్షన్ థ్రిల్లర్ War 2. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా ఓటీటీ డేట్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్. అక్టోబర్ 9 నుండి Netflixలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమ్ కానుంది. థియేట్రికల్ విండో ఎనిమిది వారాలుగా నిర్ణయించారు. ఇప్పుడు ఈ సినిమా OTT ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

War 2లో కియారా అద్వాణీ, అశుతోష్ రాణా ప్రధాన పాత్రల్లో నటించారు. చివర్లో బాబీ డియోల్ ప్రత్యేక పాత్రలో కనిపించాడు. ఈ సినిమాను యష్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా నిర్మించగా, సంగీత విభాగాన్ని ప్రీతమ్, సంచిత్ బాలహరా, మరియు అంకిత్ బాలహరా సంయుక్తంగా నిర్వహించారు.

Also Read:ఏపీకి భారీ వర్ష సూచన

- Advertisement -