బాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా నెపోటీజంపైన చర్చలు జరుగుతున్న వేళ వివేక్ అగ్నిహోత్రి వ్యాఖ్యలతో బాలీవుడ్‌లో ఒక్కసారిగా నెపోటిజం గురించి మరో సారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ప్రియాంక చోప్రా ఈ విషయం గురించి బహిరంగంగానే మాట్లాడారు. అయితే మరికొంత మంది స్టార్స్ సోషల్‌మీడియా ద్వారా పంచుకుంటుకున్నారు. తాజాగా దీన్నిపై వివేక్ అగ్నిహోత్రి స్పందించారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..నన్ను బాలీవుడ్‌కు దూరం పెట్టేశారు. కానీ నాకుఆడియన్స్ సపోర్ట్ ఉంది. వాళ్లు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. అలాగే హిందీ సినిమాలు వాస్తవికతకు దూరంగా ఉంటున్నాయన్నారు. ముఖ్యంగా కరణ్ జోహార్ తీసే సినిమాల్లో ఉన్నట్టు నిజజీవితంలో ఉండదని చెప్పారు. అందుకే బాలీవుడ్ సినిమాలు హిట్ట్ కావడంలేదన్నారు. గతంలో బాలీవుడ్ సినిమాలకు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు.
Also Read: మల్లేశం దర్శకుడి మరో ఎమోషనల్ జర్నీ.. “8AM METRO”
ఇంత పెద్ద పరిశ్రమలో జరిగే తప్పులను నేనూ కంగనా తప్ప మరెవ్వరూ ప్రశ్నించడంలేదన్నారు. అందుకే మమ్మల్ని బాలీవుడ్‌కు దూరం చేస్తున్నారని అన్నారు. తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు మాకుందన్నారు. అయితే వివేక్ స్పందనపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.
Also Read: సమంత పై స్పందించు చైతు