బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేసింది. మహారాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన సమాచారం ఆధారంగా సల్మాన్‌కు ఎక్స్ గ్రేడ్ భద్రతను అప్‌గ్రేడ్ చేస్తూ వై+గా మార్చుతున్నట్టు తెలిపింది.
బిష్ణోయ్ లకు కృష్ణజింకలంటే అమితమైన ప్రేమ. వాటిని పవిత్ర జంతువుగా భావిస్తుంటారు. కృష్ణ జింకల్ని వేటాడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ పంజాబ్ సింగర్ సిద్దూ మూసేవాలాను ఇప్పటికే హతమార్చిన బిష్ణోయ్ గ్యాంగ్. తాజాగా సల్మాన్ పై దృష్టిపెట్టినట్లు మహారాష్ట్ర ఇంటెలిజెన్స్ రిపోర్టులు చెబుతున్నాయని అందుకే భద్రతను పెంచినట్టుగా ప్రకటించారు. సల్మాన్‌తో పాటు ఇద్దరు సాయుధ గార్డ్‌లు సల్మాన్‌కు ప్రతిక్షణం భద్రతగా ఉండనున్నారు. ఇంటి వద్ద కూడా ఇద్దరు భద్రతా సిబ్బంది నిత్యం పహారా కాస్తారు.
వీరితో పాటుగా మరో కొంత మందికి వై+భద్రతను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. వారిలో బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్, దేవేంద్ర ఫఢ్నవీస్ భార్య అమృత ఫఢ్నవీస్‌లు ఉన్నారు. వీరితో పాటు శిండే వర్గ ఎమ్మెల్యేలు మరియు ఎంపీలకు ఈ కేటగిరీలను కల్పించింది.
ఇవి కూడా చదవండి..