మరోసారి డీడీఎల్‌జే ఎప్పుడంటే..

126
- Advertisement -

బాలీవుడ్‌ బాద్‌షా బర్త్‌డే సందర్భంగా అలనాటి ప్రేమ కావ్యాన్ని మరోసారి థియేటర్‌లోకి తీసుకువస్తున్నట్టు యష్‌ రాజ్‌ఫిల్మ్స్‌ సంస్థ మంగళవారం ప్రకటించిది. బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ 57వ పుట్టినరోజు పురస్కరించుకోని తన కెరీర్‌లోనే ఆల్‌టైమ్‌ హిట్‌ మూవీ దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే సినిమాను దేశవ్యాప్తంగా ప్రదర్శించనున్నారు. బుధవారం నుండి పీవీఆర్‌, ఐనాక్స్‌, సినీపోలీస్‌ థియేటర్లలో దేశవ్యాప్తంగా ప్రదర్శిస్తామని యష్‌రాజ్‌ ఫిల్స్మ్‌ సంస్థ ప్రకటించింది.

నవంబర్‌ 2న డీడీఎల్‌జేని మరోసారి పెద్ద తెరపైకి రాబోతుందని రాజ్‌ సిమ్రాన్‌ ప్రేమ ప్రయాణాన్ని చూడండి అని క్యాప్షన్‌ ఉన్న ఫోట్‌ను విడుదల చేశారు. 1995లో యష్‌చోప్రా కుమారుడు ఆదిత్య చోప్రా దర్శకుడిగా పరిచయమవుతూ వచ్చినదే… దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే సినిమా.

ఇందులో అమ్రిష్‌ పూరి, ఫరీదా జలాల్‌, అనుపమ ఖేర్‌, సతీష్‌ షా, హిమానీ శివపురి లాంటి వాళ్లు కీలకపాత్రలో కనువిందు చేశారు. ఇందులో షారూఖ్‌ ఖాన్‌ కాజల్‌ ల మధ్య తుఝే దేఖా తోహే జానా సానమ్‌,రుక్‌జా నాజానే మేరే వంటి పాటలు జతీన్‌ స్వరపరిచారు.

ప్రస్తుతం బాద్‌ షా పఠాన్ సినిమా చేస్తున్నారు. ఇందులో దీపికా పదుకొనే, జాన్‌ అబ్రహం నటించనున్న ఈ సినిమాను జనవరి 25న విడుదల కానుంది. పఠాన్‌తో పాటుగా జవాన్‌, డుంకీ సినిమాలు కూడా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

హ్యాపీ బర్త్ డే..ఇలియానా

పెళ్లిపీటలెక్కనున్న హన్సిక.. వరుడు ఎవరంటే ?

గీతాగోవిందం దర్శకుడితో బాలయ్య!

- Advertisement -