రిషి మృతితో షాక్‌కు గురయ్యా: కేటీఆర్

287
ktr rishi kapoor
- Advertisement -

బాలీవుడ్ నటుడు రిషీ కపూర్‌ మృతితో యావత్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. విలక్షణ, వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన రిషి..దేశంలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఈ నేపథ్యంలో రిషీ మరణవార్తపై స్పందించారు మంత్రి కేటీఆర్. రిషీ క‌పూర్ లేర‌నే వార్త విన‌డానికి చాలా షాకింగ్‌గా ఉందని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ వారం, ఈ సంవ‌త్స‌రం ఎంతో భ‌యంక‌రంగా ఉందని.. నిన్న ఇర్ఫాన్ ఖాన్, ఈ రోజు రిషీ క‌పూర్ చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్.

- Advertisement -