స్టార్స్‌ క్లాష్…బాలీవుడ్‌ సినిమాల లిస్ట్‌

99
- Advertisement -

తెలుగునాట సంక్రాంతికి స్టార్‌ హీరోల సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర ఒక పండుగ వాతావరణంను సృష్టిస్తాయి. అలాంటి సీన్ బాలీవుడ్‌లో కూడా ట్రెండ్ ఆవుతుందని మీకు తెలుసా..! 2001లో వచ్చిన గదర్ సినిమా, లగాన్‌ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టించాయి. ఇద్దరు స్టార్లు, భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌ కలగలిపి ఉంటాయి. ఇందులో  విషయం ఎంటంటే రెండు దేశ భక్తితో కూడిన సినిమాలుగా నిలిచాయి. అలాగే అలాంటి ట్రెండ్ 2022లోనూ జరిగింది. ఎందులో అంటే బాయ్‌కట్‌ చేయడంలో ఒక సినిమా తర్వాత మరొకటి సినిమాను బాయ్‌కట్‌ ట్రెండ్‌ సెట్ చేసి డిజాస్టర్‌గా మిగిల్చాయి.

అలాంటి సినిమాలు ఎంటో తెలుసా..! లాల్‌సింగ్‌ చడ్డా కాగా మరొకటి రక్షా బంధన్ సినిమా. ఇలాంటి తరుణం మరోసారి 2023లో వచ్చింది. అది ఎలా అంటే 2001లో వచ్చిన సినిమాకు సీక్వెల్‌ వచ్చిన గదర్‌ సినిమా 2023లో ప్రదర్శితమవుతుంది. మరోటి రణబీర్ కపూర్ నటిస్తున్న యానిమల్ ఆలియా భట్‌ కపూర్ నటిస్తోన్న హార్ట్‌ ఆఫ్ స్టోన్‌ సినిమాలు కూడా ఈ యేడాది ఒకే రోజున విడుదల కానున్నాయి.

 అనిల్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్న గదర్‌2 సినిమాలో అమీషా పటేల్ ఉత్కర్ష్‌ శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్బంగా హీరో సన్నీ డియోల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ…హిందుస్తాన్ జిందాబాద్ హై….జిందాబాద్ థా.. ఔర్ జిందాబాద్ రహేగా! ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రెండు దశాబ్దాల తర్వాత భారతీయ సినిమాలో అతిపెద్ద సీక్వెల్‌ని మీ ముందుకు తీసుకువస్తున్నామని…ఆగస్ట్‌11న విడుదలకు సిద్ధంగా ఉందని పోస్ట్‌ చేశారు.

సందీప్ రెడ్డి వంగా  దర్శకత్వం వహిస్తున్న యానిమల్‌ సినిమాలో రణ్‌బీర్ కపూర్‌ నటిస్తున్నారు. ఈ సినిమాలో అనిల్ కపూర్‌ బాబీ డియోల్‌ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఇటీవల మేకర్స్‌ ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రణ్‌బీర్ కపూర్‌ చేతుల నిండా రక్తంతో చంకలో గొడ్డలి పట్టుకొని సిగరెట్‌ వెలిగిస్తూ కనిపించాడు.

మరోవైపు టామ్ హార్పర్‌ నేతృత్వంలో వస్తున్న సినిమా హార్ట్‌ ఆఫ్ స్టోన్. ఈ సినిమాలో ఆలియా భట్‌ కపూర్ తో పాటుగా గాల్ గాడోట్‌ నటించనుంది. ఈ సినిమాపై ఆలియా ఇన్‌స్టా ద్వారా షేర్ చేస్తూ అధికారిక విడుదల తేదీని ప్రకటించింది. టామ్ క్రూజ్‌ నటించే మిషన్‌ ఇంపాజిబుల్‌ సిరీస్‌లో భాగంగా ఇది విడుదల కానున్నట్టు ప్రచారం.

గమ్మత్తు ఎంటంటే… గదర్ 2లో నటించే సన్నీడియోల్‌, యానిమల్ లోని బాబీ డియోల్ ఇద్దరు సోదరులు. యానిమల్ లో నటించే రణ్‌బీర్ కపూర్‌, హార్ట్‌ ఆఫ్ స్టోన్ లో నటించే ఆలియా భట్ ఇద్దరూ కూడా భార్యభర్తలు… మరీ వేచి చూడాలి బాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద ఎవరు కాసుల వర్షం కురిపిస్తారో…!

ఇవి కూడా చదవండి…

పఠాన్‌ పై ప్రసంశల వర్షం

పూజా హెగ్డే అందుకే దూరం

ట్రోల్స్ పై బాలయ్య స్పందన

- Advertisement -