జాన్వీ కపూర్.. ఓ అందమైన కష్టం

73
- Advertisement -

బాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ లో జాన్వీ కపూర్ కి ఉన్న క్రేజ్ మరో ఏ హీరోయిన్ కి లేదు. ఐతే, ఆ క్రేజ్ కి కారణం ఆమె ఫిట్ నెసే. జాన్వీ కపూర్ ఎంత హాట్ గా ఉంటుందో అంత ఫిట్ గా ఉంటుంది. నార్త్ లో మలైకా అరోరా తర్వాత అంతగా ఫిట్ నెస్ మెయింటేన్ చేసేది జాన్వీ కపూర్ నే. పెర్ఫెక్ట్ లుక్ కోసం జాన్వీ కపూర్ ప్రతి రోజు కఠినమైన వ్యాయామాలు చేస్తుంది. ఉదయాన్నే భారీ వర్క్ అవుట్స్ జాన్వీ దినచర్యలో భాగం.

నిజానికి ఎప్పుడు ఒకేలా బాడీని మెయింటైన్ చేయడం చిన్న విషయం ఏమీ కాదు. కానీ, జాన్వీ కపూర్ మాత్రం తన ఫీట్ నెస్ తో ఎట్రాక్ట్ చేస్తుంది. జాన్వీ కపూర్ వర్కౌట్స్ కి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. అసలు జాన్వీ కపూర్ ఇంతలా ఎందుకు కష్టపడుతుంది ?, ఆమెకు గ్లామర్ ఉంది. స్టార్ డమ్ ఉంది. అయినా ఇంతలా ఎందుకు కష్టపడాలి ? అంటూ నెటిజన్లు నేరుగా ఆమెనే ప్రశ్నిస్తున్నారు. తాను స్ట్రాంగ్ విమెన్ గా ఉండాలనేది జాన్వీ కపూర్ కోరిక అట.

ఫ్యూచర్ లో జాన్వీ కపూర్ గురించి చెప్పుకోవాలి అంటే.. ముందుగా ఆమె ఫిట్ నెస్ గురించి చెప్పుకోవాలట. మొత్తానికి జాన్వీ కపూర్ తగ్గేదే లే అంటుంది. ఎంతైనా అతిలోక సుందరి శ్రీదేవి అందాల తనయ కదా. ఆ మాత్రం తెగింపు లేకపోతే ఎలా. ఏ మాటకామాట చెప్పుకోవాలి. జాన్వీ కపూర్ స్క్రీన్ ప్ర‌జెన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతారు. పైగా బాలీవుడ్ లో యంగ్ హీరోయిన్స్ లో జాన్వీ కపూర్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఇక జాన్వీ కపూర్ ఫొటోలు అయితే ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తాయి. తెర‌పైనే కాదు, తెర వెనుక కూడా అత్యంత అందంగా క‌నిపించే భామ‌గా కూడా జాన్వీ కపూర్ కి మంచి పేరు ఉంది. అయినా ఆమె ఫిట్ నెస్ కోసం నిత్యం కష్టపడుతుండటం గ్రేట్.

ఇవి కూడా చదవండి…

ఆస్కార్ లో వెనకబడ్డ RRR.. రిజన్ అదే

మూడో పెళ్ళికి కారణం అప్పులే

పూజా హెగ్డే అందుకే దూరం

- Advertisement -