సౌత్ కన్నా బాలీవుడ్ సినిమాలో నైతికత లేదని నటి కాజల్ అగర్వాల్ అన్నారు. సౌత్ కన్నా బాలీవుడ్‌లో విలువలతో కూడిన నైతికత లోపించదని తెలిపారు. ఇటీవల ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కాజల్ దక్షిణాది సినిమాలు వర్సెస్ బాలీవుడ్ అనే అంశంపై స్పందించారు. ఈ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ…టాలెంట్ ఉంటే దక్షిణాది ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని అన్నారు. నేను ముంబాయిలో పుట్టి పెరిగాను కానీ సినిమాల పరంగా హైదరాబాద్, చైన్నై నగరాలే నా నివాస స్థానాలుగా భావిస్తుంటా. అది ఎప్పటికీ మారదు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్నేహాపూర్వకంగా ఉంటారని తెలిపింది. అద్భుతమైన దర్శకులు మంచి టెక్నీషియన్స్ అక్కడ ఉన్నారు.
తెలుగు తమిళ మలయాళం కన్నడ భాషల్లో విడుదలై సినిమాలు మంచి కంటెంట్ ఉంటున్నాయని చెప్పుకొచ్చింది. హిందీ మా మాతృభాష బాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగాను. అలాగే బాలీవుడ్‌లో మంచి సినిమాల్లో నటించాను. కానీ దక్షిణాది పరిశ్రమలో ఉన్న నైతికత విలువలు క్రమశిక్షణ బాలీవుడ్‌లో లోపించాయని నేను భావిస్తున్నా అని కాజల్ అన్నారు. అయితే కాజల్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దీంతో కొంతమంది బాలీవుడ్‌లోని ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కాజల్‌పై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి…