జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా టెంపర్. ఈచిత్రం ఎన్టీఆర్ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది. అంతేకాకుండా బాక్సాఫిస్ వద్ద భారీ కలెక్షన్లను కూడా రాబట్టింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈసినిమాకు వక్కంతం వంశీ కథను అందించారు. ఈసినిమాను బాలీవుడ్ లో సింబా పేరుతో తెరకెక్కించారు. అక్కడ కూడా ఈచిత్రం పెద్ద హిట్ సాధించింది. ప్రస్తుతం తమిళ్ లో కూడా ఈచిత్రాన్నీ రీమేక్ చేస్తున్నారు.
విశాల్, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ శిష్యుడు వెంకట్ మెహన్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయోగ్య అనే టైటిల్ తో ఈమూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈచిత్రంలోని ఐటెం సాంగ్ లో సన్నీలియోన్ నటించిందని వార్తలు వస్తున్నాయి.
విశాల్ తో కలిసి సన్నీ స్టెప్పులేసిందని కోలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. త్వరలోనే ఈవిషయంపై క్లారిటీ ఇవ్వనున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన ఈచిత్ర ఫస్ట్ లుక్ పై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. త్వరలోనే ఈసినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్.