“వాల్మీకి”గా వ‌రుణ్ తేజ్

249
varun tej Valmiki
- Advertisement -

విభిన్న‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ వ‌రుస హిట్ ల‌ను అందుకుంటున్నాడు మెగా హ‌రో వ‌రుణ్ తేజ్. ఇటివ‌లే ఆయ‌న న‌టించిన అంత‌రిక్షం, ఎఫ్2 చిత్రాలు ఘ‌న విజయాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న మ‌రో చిత్రాన్ని కూడా ప్ర‌క‌టించేశారు. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌కత్వంలో వాల్మీకి అనే సినిమాను చేయ‌నున్నాడు. తాజాగా ఈమూవీ టైటిల్ పోస్ట‌ర్ ను కూడా విడుద‌ల చేశారు చిత్ర‌యూనిట్. ఈరోజు ఉద‌యం ఈచిత్ర పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది.

valmiki

వివి వినాయ‌క్, సుకుమార్ , దిల్ రాజుతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పూజా కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. వ‌రుణ్ తేజ్ సోద‌రి నిహారిక క్లాప్ కొట్టింది. త్వ‌ర‌లోనే ఈమూవీ రెగ్యూల‌ర్ షూటింగ్ ప్రారంభంకానుంద‌ని స‌మాచారం.

Valmiki

త‌మిళ్ లో ఘ‌న విజ‌యం సాధించిన జిగర్తాండ మూవీకి ఇది రీమేక్ గా చిత్రిక‌రించ‌నున్నార‌ని తెలుస్తుంది. త‌మిళంలో బాబీ సింహా పోషించిన పాత్ర‌ని తెలుగులో వ‌రుణ్ తేజ్ చేయ‌నున్నాడ‌ట‌. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని 14 రీల్స్ సంస్ధ‌వారు నిర్మించ‌గా దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నారు. దువ్వాడ జ‌గ‌న్నాధ‌మ్ మూవీ త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ ఈసినిమాను చేస్తున్నాడు.

- Advertisement -