సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఎఫెక్ట్..ట్వీట్ట‌ర్ డిలిట్ చేసిన సోనాక్షి సిన్హా

355
- Advertisement -

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య సోష‌ల్ మీడియాలో చ‌ర్చాంశ‌నీయంగా మారింది. సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌కు బాలీవుడ్ లోని కొంద‌రు అగ్ర హీరోలే కార‌ణ‌మ‌ని ఆయ‌న అభిమానుల‌తో పాటు ప‌లువురు సెల‌బ్రెటీలు కూడా బ‌హిరంగంగానే చెప్పారు. దీంతో సుశాంత్ అభిమానులు వారిపై మండిప‌డుతున్నారు. నెపోటిజం వల్లే సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని బాలీవుడ్ వ‌ర్గాల్లో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే నెపోటిజం కార‌ణంగా తాను ట్వీట్ట‌ర్ అకౌంట్ ను డిలిట్ చేస్తున్నానని ప్ర‌క‌టించింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా.

ఈమేర‌కు ట్వీట్ట‌ర్ ఆమె పోస్ట్ చేసింది. నీ చిత్తశుద్ధిని కాపాడుకోవాలంటే వేయాల్సిన తొలి అడుగు నెగటివిటీకి దూరంగా ఉండటమే. ముఖ్యంగా ఈ సమయంలో ట్విట్టర్‌కి దూరంగా ఉండాలి. ఛలో.. నేను నా అకౌంట్‌ని డీయాక్టివేట్ చేస్తున్నా. బై గైస్… ఇక ప్రశాంతంగా ఉండండి అని పోస్ట్ పెట్టింది. బాలీవుడ్ లో ఒక వ‌ర్గం వాళ్లు మాత్ర‌మే సినిమాల్లో న‌టిస్తున్నార‌ని అభిమానులు మండిప‌డుతున్నారు సుశాంత్ అభిమానులు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేని వారిని పైకి రానివ్వ‌ర‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈనేప‌థ్యంలో స‌ల్మాన్ ఖాన్, క‌ర‌ణ్ జోహార్ లను ఫాలో అవుతున్న చాలా మంది సుశాంత్ అభిమానులు లెఫ్ట్ అయ్యారు.

- Advertisement -