ఆదిపురుష్‌పై కృతి కామెంట్‌…

105
- Advertisement -

అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మించిన పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్‌. ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో ప్రభాస్ కృతి సనన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రామాయణం ఆధారంగా చిత్రం తెరకెక్కుతున్న ఈసినిమాను అక్టోబరు 2న అయోధ్యలో విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఆదిపురుష్‌లో రాముడి పాత్రతోపాటు హనుమంతుడు రావణాసురుడి పాత్రలను పూర్తిగా మార్చేశారని రామాయణాన్ని అవమానించారంటూ విమర్శలు రావడంతో ఈసినిమాను జూన్‌ 16, 2023న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని ప్రకటించినా చివరకు చిత్రంలో వాడిన వీఎఫ్‌ఎక్స్‌పై వచ్చిన విమర్శలతో వెనక్కి తగ్గినట్టుగా ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం చిత్రంలోని కొన్ని సన్నివేశాలను రీషూట్ చేసేందుకు చిత్రం విడుదలను వాయిదా వేసినట్టుగా బాలీవుడ్‌ టాక్‌. తాజాగా చిత్రంపై వచ్చిన విమర్శలపై బాలీవుడ్‌ బ్యూటీ కృతిసనన్ స్పందించింది.

భేదియా’ చిత్రం ప్రమోషన్స్‌ సందర్భంగా.. ‘ఆదిపురుష్‌’ వివాదంపై ప్రశ్నించించగా.. ఇది మనమందరం చాలా గర్వించదగ్గ చిత్రమని తెలిపింది. అయితే ఎవరూ టీజర్‌ను చూసి సినిమాను అంచనా వేయొద్దని సూచించింది. చిత్రాన్ని గ్రాండ్‌గా అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్స్‌తో మీ ముందుకు తీసుకురాబోతున్నామని, డైరెక్టర్‌ ఓం రౌత్‌ అద్భుతంగా చిత్రాన్ని తెరక్కించారని చెప్పింది. అయితే, ప్రస్తుతం ఇంకా మరింత మెరుగ్గా తీసుకువచ్చేందుకు సినిమా విడుదలను కొద్దిరోజుల పాటు వాయిదా వేసినట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

బూర్జ్‌ ఖలీఫాపై భేదియా ట్రైలర్…

దమ్మున్న సినిమానే ఆడుతుంది:అల్లు

దక్షిణాదిలో ప్రాంతీయ చిచ్చు…

- Advertisement -