త్వరలోనే బన్నీని కలుస్తా: షారుఖ్ ఖాన్…

377
allu arjun bollywood hero sharukh
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై ప్ర‌శంస‌ల్లో ముంచెత్తాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. తాజాగా ఆయ‌న జీరో సినిమాలో న‌టించారు. ఈసినిమా విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. ఈమూవీ ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న ఇటివ‌లే హైద‌రాబాద్ కు వ‌చ్చారు. స‌ర‌దాగా కాసేపు ఇక్క‌డి విలేక‌ర్ల‌తో ముచ్చ‌టించారు. ఈసంద‌ర్భంగా ఓ విలేకరి అల్లు అర్జున్‌ గురించి అడ‌గ‌గా ఆయ‌నపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ‘అల్లు అర్జున్‌ అంటే నాక్కూడా ఇష్టమే. అతన్ని కలవాలని, మాట్లాడాలని ఉంది.

Sharuk Khan

అల్లు అర్జున్‌ అద్భుతమైన టాలెంట్‌ ఉన్న నటుడు’ అని చెప్పారు. కొద్దిరోజుల క్రితం బన్నీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షారుక్‌ నటించిన ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాలోని ఓ పాపులర్‌ స్టిల్‌ను పోస్ట్‌ చేశారు. ‘తుఝే దేఖా తో యే జానా సనమ్‌.. 1995లో ఈ సినిమా చూసినప్పుడు ఓ మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది. 23 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రాన్ని చూసినప్పుడు అప్పుడు కలిగిన అనుభూతే కలిగిందన్నారు షారుఖ్.

- Advertisement -