పీవీ సింధుకు సీఎం కేసీఆర్‌ అభినందనలు..

191
PV Sindhu
- Advertisement -

ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ టైటిల్‌ విజేతగా నిలిచిన పీవీ సింధుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్ నెగ్గడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ టైటిల్ గెలిచిన తొలి భారత షట్లర్‌గా చరిత్ర సృష్టించిన సింధును కేసీఆర్ అభినందించారు.

భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు. టైటిల్ విజేత సింధుకు గవర్నర్ నరసింహన్ కూడా అభినందనలు తెలియజేశారు. గతేడాది ప్రపంచ టూర్ ఫైనల్లో ఓడిన సింధు.. ఈ ఏడాది హోరాహోరీగా సాగిన తుదిపోరులో పోరాడి విజేతగా నిలిచింది.

- Advertisement -