కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన మంత్రి హరీష్..

308
harishrao
- Advertisement -

హరీష్ రావు అంటే కాయిన్ బాక్స్ ఎమ్మెల్యే అని, వాట్సప్ మంత్రి అని…ఫేస్ బుక్, ట్విట్టర్ సందేశాలకు స్పందించే ప్రజా నాయకుడు అని..ఎక్కడా ఉన్న ఒకే సారి 200 నుండి 2000 మందితో టెలికాన్ఫరెన్స్ చేసే పొలిటికల్ లేడర్ అని అది కేవలం హరీష్ రావు అనే విన్నాం కానీ ఇప్పుడు మరో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు.

సాంకేతికతను అందిపుచ్చుకోవడం లో హరీశ్ రావు గారు ఆయనకి ఆయనే సాటి అని మరో సారి చాటి చెప్పారు.. తన సెల్ ఫోన్ ద్వారా తానే వీడియో కాన్ఫరెన్స్ చేసాడు కరోనా నేపథ్యంలో లో లాక్ డౌన్ ఉండటం తో అభివృద్ధి పనుల్లో సమీక్షలు చేయడం ఎక్కువ మంది రావడం ఇబ్బంది గా ఉంటుంది అని ..అందుకు ఎక్కడ ఉన్నా వీడియో కాన్ఫరెన్స్ సెల్ ఫోన్ తోనే చేసుకొనే విధంగా టెక్నాలజీని ఉపయోగించి ఈరోజు ఒకే రోజు 8 మందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ,పబ్లిక్ హెల్త్ ఈఈ ప్రతాప్ , డీఈ లక్ష్మణ్ , osd బాల్ రాజ్ గారు, సానిటరి ఇన్స్పెక్టర్లు సత్యనారాయణ, సతీశ్ లు తో కల్సి నిర్వహించారు.. ఇక నుండి మండలాల వారిగా నియోజకవర్గ వారిగా ప్రజాప్రతినిధులతో అధికారులతో ఇదే స్థాయి లో జరుగుతుంది అని చెప్పారు.. అధికారులు కూడా ఇదే పద్దతిని అలవాటు చేసుకోవాలి అని సూచించారు.

- Advertisement -