బాలీవుడ్లో అగ్రహీరోలు అయిన ఖాన్ త్రయంకు సమానంగా ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉన్న హీరో హృతిక్‌రోషన్. నార్త్‌కు సమానంగా సౌత్‌లోనూ క్రేజ్ సంపాదించుకున్న హీరో. తాజాగా తను ఒక ఖరీదైన ఇల్లును కొనుగోలు చేసినట్లు బాలీవుడ్లో టాక్.
2000వ సంవత్సరంలో ప్రముఖ ఇంటిరియర్ డిజైనర్ సుసన్నే ఖాన్‌ను వివాహమాడిన హృతిక్…కొన్ని మనస్పర్థలు రావడంతో 2014లో విడాకులు తీసుకున్నారు. అయితే తాజాగా సబా అజాద్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. వీరిద్దరూ కలిసి పార్టీలకు పబ్బులకు వెళ్తూ మీడియా దృష్టికి వచ్చారు. ఇన్ని రోజులు వీరిద్దరూ ఎవరింట్లో వాళ్ళు ఉండగా.. ఇప్పుడు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారట. ఇందుకోసం హృతిక్ ముంబైలోని ఓ బీచ్ హౌస్‌ను రూ.100 కోట్లు పెట్టి మరికొన్నాడట.
రెండు అపార్టుమెంట్లుగా ఉన్న ఈ నివాసంలో హృతిక్, సబా అజాద్లో కలిసి ఉండబోతున్నాడట. 38వేల చదరపు అడుగులు విస్తీర్ణంతో ఉన్న ఈ రెండు అపార్టుమెంట్ల నుండి అరేబియా సముద్రం క్లియర్‌గా కనిపిస్తుందట. హృతిక్-సబా అజాద్ గత కొంత కాలంగా డేటింగ్లో ఉన్నారు. త్వరలోనే సబాతో ఏడడుగులు వేయాలని భావిస్తున్నట్టు బాలీవుడ్లో టాక్.
ఇవి కూడా చదవండి…
వాల్తేరు.. మెగా ట్రీట్ ఖాయమట!
ఇదే గొప్ప బహుమతి..సామ్ ఎమోషన్!
విడాకులపై నిఖిల్ అఫిషియల్!