ఢిల్లీలో జరిగిన యాసిడ్ ఘటన తనను చాలా బాధేసిందని బాలీవుడ్ క్వీన్ కంగనారనౌత్ చలించిపోయారు. తాను టీనేజీలో ఉన్నప్పుడు 21యేళ్ల వయస్సున్న తన సోదరిపై జరిగిన యాసిడ్ దాడి ఘటన గుర్తుకు తెచ్చుకొని భావోద్వేగానికి గురయ్యారు.
ఆక్టోబర్5, 2006న యాసిడ్ దాడిలో మా సోదరి రంగోలి చందేలా మొహం సగం కాలిపోయిందన్నారు. ఓ కన్ను చూపు కోల్పోయింది. చెవి పూర్తిగా కాలిపోయిన నాటి సంఘటనను గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ఛాతీ భాగం చాలా వరకు డ్యామేజ్ అయింది. 3 యేళ్లలోనే 57 శస్త్రచికిత్సలు చేశారని తెలిపారు. దీంతో ఆమె పెళ్లి సంబంధం రద్దైందన్నారు.
తను శారీరకంగా మానసికంగా ఎంతో కుంగిపోయిందని…ఎవరితోనూ మాట్లాడేది కాదని అక్కని చూసి తట్టుకోలేకపోయా అని తెలిపింది. మళ్లీ ఆమెను యోగాతో మాములు మనిషి చేసుకున్నామని…ఇప్పటికీ నాటి చేదు జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉంటాయన్నారు. దీంతో నాపక్క తెలియని వ్యక్తులు వెళ్తే తీవ్రంగా భయానికి లోనైత అని తెలిపింది. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అని కంగనా ఇన్‌స్టా వేదికగా కోరారు.
ఇవి కూడా చదవండి…