మాజీ సీఎం కొడుకుతో చైతూ డైరెక్టర్ సినిమా

351
nikhil
- Advertisement -

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ హీరోగా మూవీని తెరకెక్కించనున్నారు విజయ్ కుమార్ కొండా. నితిన్‌తో గుండెజారి గల్లంతయ్యిందే,నాగచైతన్యతో ఒక లైలా కోసం సినిమాలు చేసిన విజయ్…లాంగ్ గ్యాప్‌ తర్వాత తన కొత్త ప్రాజెక్టును ప్రకటించారు.

శాండల్‌వుడ్ హీరో దేవేగౌడ మనవడు నిఖిల్‌తో మూవీకి సంతకం చేశారు. జాగ్వార్‌తో వెండితెరపై ఆరంగేట్రం చేసిన నిఖిల్ తాజాగా సోలో హీరోగా రానుండగా ఈ సినిమాలో బాస్కెట్ బాల్ ప్లేయర్‌గా కనిపించనున్నారు.

ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ‘లహరి మ్యూజిక్’ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది.

- Advertisement -