లైగర్ ఎఫెక్ట్ రెమ్యూనరేషన్ తగ్గిస్తుంది

394
- Advertisement -

హీరోయిన్స్ తమ పారితోషికాన్ని తగ్గించుకోవడం చాలా అరుదుగా వింటుంటాం. అయితే తాజాగా బాలీవుడ్ నటి అనన్య పాండే తన రెమ్యునరేషన్ తగ్గించాల్సి వచ్చింది.

అనన్య కి ప్రస్తుతం క్రేజీ ఆఫర్స్ లేవు. దీంతో తన రెమ్యునరేషన్‌ను ₹50 లక్షలకు తగ్గించుకుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ లైగర్ సినిమా అనన్య కెరీర్ పై గట్టి ఎఫెక్ట్ చూపించింది. అయితే, విషాదం ఏమిటంటే, ఈ రెమ్యునరేషన్‌లో భారీగా కోత విధించినప్పటికీ, అనన్య కొత్త ప్రాజెక్ట్‌లను పొందడం కష్టమవుతోంది.

లైగర్ తర్వాత విజయ్ కెరీర్ కూడా కష్టాల్లో పడింది. పూరి కెరీర్ టోటల్ గా అయిపోయిందని చెప్పేవాళ్లు కూడా ఉన్నారు. అనన్య చివరి మూడు రిలీజ్ లు ‘ఖాలీ పీలీ’, ‘గెహ్రైయాన్’ మరియు ‘లైగర్’. ఈ మూడు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా దెబ్బ తిన్నాయి. దీంతో దర్శకనిర్మాతలు ఈ హీరోయిన్‌పై ఐరన్ లెగ్‌ అనే ట్యాగ్ వేసేశారు ఆమెను తమ సినిమాలలో నటింపజేయడానికి భయపడుతున్నారు. మరి అనన్య కెరీర్ కి ఊపు తెచ్చే సినిమా ఎప్పుడు పడుతోందో? చూడాలి.

ఇవి కూడా చదవండి…

ఆలియా రిటైర్‌ కారణం తెలిస్తే షాక్‌…

ఆ హీరో 2023లో ఏకంగా 20 చిత్రాల్లో..

మెగాస్టార్ పై కూడా హీరోయిన్ ఎఫెక్ట్

- Advertisement -