ప్రముఖ బాలీవుడ్ నటీ ప్రయాంక చోప్రా ఇటివలే ఓ ఫంక్షన్ లో ఆమె ధరించిన చెప్పుల ఖరీదు వింటే షాక్ కు గురవ్వాల్సిందే మరి. బ్రిటన్ రాకుమారుడు హ్యారీ, అమెరికా నటి మేఘన్ మార్కల్ ల పెళ్లి ఇటివలే జరిగిన విషయం తెలిసిందే. అతి తక్కువ మంది అతిరథమహారథుల మధ్య వీరి వివాహం జరిగింది. ఆ అతి తక్కువ మందిలో మన బాలీవుడ్ నటి ప్రియాంక కూడా ఉన్నారు. ప్రియాంక చోప్రాకు అమెరికా నటి మేఘన్ కు మంచి స్నేహితురాలు. తన స్నేహితురాలి జీవితం ఈపెళ్లితో మారిపోతుందని, ఆమె తెలివైన నటి అన్నారు ప్రియాంక.
తన ప్రియమైన స్నేహితురాలి పెళ్లికి ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్న చెప్పులు వేసుకెళ్లింది. రూ.1.35 లక్షల విలువగల చెప్పులు వేసుకెళ్లి ఇప్పుడు ఆమె చెప్పుల ఖరీదు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైహిల్స్ తో మెరిసిన ప్రియాంక ఫంక్షన్ లో అట్రాక్షన్ గా నిలిచారు. బ్రిటర్ మహారాణి ఇంట్లో పెళ్లి కాబట్టి అందకు తగ్గట్టుగానే ప్రియంక అందంగా ముస్తాబయి వెళ్లారు. ప్రియాంక వేసుకున్న డ్రెస్ తోపాటు ఆమె అందాలు అదిపోయాయంటున్నారు అభిమానులు. దింతో తన స్నేహితురాలి పెళ్లి ఫోటోలు తన ట్వీట్టర్ లో పోస్ట్ చేసింది ప్రియాంక.