నాన్నను ఆ స్థితిలో చూసి అమ్మ కుప్పకూలిపోయింది-ఐరన్ లెగ్ శాస్త్రి తనయుడు

333
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఐరన్ లెగ్ శాస్త్రి. ఒక్కప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నటుడిగా ఓ వెలుగు వెలిగారు. కామెడీ కింగ్ బ్రహ్మానందంతో కలిసి నటించిన సినిమాలో ఐరెన్ లెగ్ అని పేరు అనిపించుకున్న ఆయనకి తర్వాత ఇంటి పేరు కూడా ఐరన్ లెగ్ శాస్త్రిగా మారిపోయింది. భారీకాయంతో అందరిని నవ్వించిన శాస్త్రి.. ఆ భారీ కాయమే ఆయన శాపంగా మారి అనారోగ్యానికి గురిచేసింది. ఆ అనారోగ్యంతో ఆయనను ఒక్కసారిగా అవకాశాల నుంచి దూరం చేసింది.

Iron Leg Sastry Son Entry In Tollywood

అలాంటి ఐరన్ లెగ్ శాస్త్రి తనయుడు ప్రసాద్ ‘జంబ లకిడి పంబ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అవకాశాలు తగ్గిపోవడంతో నాన్న మా సొంత ఊరి తాడేపల్లిగూడెంకి వెళ్లి పోయారు. నేను,అమ్మ ఇద్దరం హైదరాబాద్ లో ఉండేవాళ్లం. ఓ రోజు నాన్నకు గుండెపోటు అని ఫోన్ వచ్చింది. వెంటనే నేను అమ్మ ట్రైన్ ఎక్కేసి మా ఊరు బయల్దేరాం. ట్రైన్ దిగి హస్పిటల్ కి వెళుతున్నాం. అంతలోనే ఎదురుగా రిక్షాలో నాన్న శవం కనిపించింది. నాన్నను ఆ స్థితిలో చూసిన అమ్మ ఒక్కసారిగా కుప్పకూలిపోయిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

- Advertisement -