ప్రభాస్-సుజీత్‌ కాంబోలో మరో మూవీ..!

147

‘బాహుబలి’ ఈ సినిమా తర్వాత ప్రభాస్ పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయారు. ఈ సినిమా తర్వాత ఆయన సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ అనే సినిమాలో నటించారు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా.. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోనా.. కలెక్షన్లు మాత్రం బాగానే రాబట్టింది. ఇక ప్రస్తుతం ప్రభాస్‌ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సినీ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. సాహో డైరెక్టర్‌ సుజీత్‌తో ప్రభాస్ మరో సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. అంతేకాడు ఇందులో ప్రభాస్ సూపర్ కాప్‌గా నటించబోతున్నాడంటూ నెట్టింట వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది.

తాజాగా ఓ సూపర్ కాప్ స్టోరీ లైన్‌ని ప్రభాస్‌కి వినిపించాడట సుజీత్. ఆ లైన్ బాగా నచ్చడంతో పూర్తి స్థాయి స్క్రిప్ట్ సిద్దం చేయమని చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’, ‘సలార్’, ‘ఆదిపురుష్’ చిత్రాలతో పాటు వైజయంతీ మూవీస్‌లో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సైన్ ఫిక్షన్ ‘ప్రాజెక్ట్ k’ మూవీని చేస్తున్నారు ప్రభాస్. వీటి తర్వాతే ప్రభాస్ – సుజీత్‌ల ప్రాజెక్ట్ ఉండే అవకాశాలున్నాయి. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుందని తెలుస్తోంది.