భూమా అఖిలప్రియ అరెస్ట్..‌!

383
buma
- Advertisement -

హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలో అర్థరాత్రి కిడ్నాప్‌ కలకలం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మాజీ హాకీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు, ఆయన సోదరులను సునీల్ రావు, నవీన్‌రావులను అపరహించడం కాసేపట్లోనే పోలీసులు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. వీరు ముగ్గురూ సీఎం కేసీఆర్‌ పీఏ వేణుగోపాలరావుకు బావమరుదులు.

కిడ్నాపర్లు భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ పేరుతో బెదిరింపులకు పాల్పడటంతో భూమా అఖిలప్రియను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కూకట్‌పల్లిలో భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్ ను అదుపులోకి తీసుకున్నారు.కిడ్నాపర్లపై మొత్తం ఆరు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

50 ఎకరాలకు సంబంధించిన భూ వివాదం భూమా నాగిరెడ్డి హయా నుంచి కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అఖిలప్రియ భర్త భార్గవరెడ్డి సోదరుడు సెటిల్‌మెంట్‌ చేసేందుకు ప్రయత్నించినట్టు సమాచారం.

- Advertisement -