జోరు వర్షం….బోగత ఉగ్రరూపం

559
bogatha water fall
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ గుట్టలు, పెనుగోలు నల్లందేవి వాగు, పాలవాగు గుట్టలపై నుంచి వస్తున్న వరద నీరు భారీగా చేరి అందాలతో పర్యాటకులను కట్టిపడేస్తోంది. నింగి నుంచి నేలకు జాలువారిన పాల సంద్రంలా మారిన బొగత జలపాతం వరద నీటితో కళకళలాడుతూ పర్యటకులను ఆక‌ర్షిస్తోంది.

కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో జలపాతానికి భారీగా వరద నీరు చేరి ఉద్ధృతంగా పొంగుతోంది. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో పర్యాటకులను అనుమతించడం లేదు అధికారులు. వరద తీవ్రత తగ్గే వరకూ పర్యాటకులు ఇక్కడికి రాకపోవడం మంచిదని సూచిస్తున్నారు.

మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణహమ్మ ఉరకలేస్తోంది. ఆల్మట్టి, నారాయణపుర, జూరాల ప్రాజెక్టుల నుంచి వరద నీరు శ్రీశైలానికి చేరుకుంది. ఇప్పటికే ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ నిండటంతోపాటు మరికొన్ని రోజులు వరద కొనసాగుతుందని సీడబ్ల్యూసీ అంచనావేసి ఆదేశాలివ్వడంతో వచ్చిన వరదనీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. శ్రీశైలంలో ప్రస్తుతం 42.53 టీఎంసీల నీటినిల్వ ఉన్నది. వరద ఇలాగే కొనసాగితే నాలుగైదురోజుల్లో కృష్ణమ్మ నాగార్జునసాగర్‌కు పరుగులు తీయనుంది.

- Advertisement -