కేటీఆర్‌ను సీఎం చేయాలనే అభిప్రాయాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈటల రాజేందర్…కేటీఆర్‌ని సీఎం చేస్తే తప్పేంటని వ్యాఖ్యానించగా తాజాగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ సమర్థుడని ..ప్రస్తుత పరిస్థితుల్లో కేటీఆర్ సీఎం అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.వచ్చే అసెంబ్లీ సమావేశాలు కేటీఆర్ అధ్యక్షతన జరగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కేటీఆర్ సీఎం అయితే పార్టీలోని యువతకు పదవులు వస్తాయని సంకేతం ఇచ్చినట్టు అవుతోందన్నారు. కేటీఆర్ సీఎం అయ్యేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదం ఇవ్వాలని ఎమ్మెల్యే షకీల్ కోరారు.
బుధవారం బోధన్ లో మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతోందని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ ను సీఎం చేయాలని రాష్ట్రంలోని యువత కోరుకుంటోందన్నారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి సైతం సీఎం కేసీఆర్ ఆలోచించి.. కేటీఆర్ ను సీఎంను చేయాలని విజ్ఞప్తి చేశారు.