- Advertisement -
భారత సర్వోన్నత న్యాయస్ధానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు సీజేఐ రంజన్ గొగొయ్. నవంబర్ 17న గొగొయ్ పదవీ కాలం ముగుస్తుండటంతో తన వారసుడిగా బాబ్డే పేరును ప్రతిపాదించారు.
బాబ్డే 24 ఏప్రిల్, 1956న నాగ్‌పూర్‌లో జన్మించారు. మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ ఛాన్సలర్‌గా సేవలందించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు.
నవంబర్ 18వ తేదీన బాబ్డే భారతదేశపు 47వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఏడాది 5 నెలలపాటు సిజెఐగా కొనసాగుతారు. స్వయంగా గొగొయ్ నుంచి సిఫార్సులు రావడంతో బాబ్డే నియామకం వైపు కేంద్రం మొగ్గు చూపవచ్చని తెలుస్తోంది.
- Advertisement -