న‌వంబ‌ర్‌లో వస్తున్న ‘బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌’..

273
Bluff Master movie
- Advertisement -

ఎవ‌రో న‌లుగురు ర‌చ‌యిత‌లు నాలుగు గోడ‌ల మ‌ధ్య కూర్చుని నాలుగు రోజుల్లో రాసిన క‌థ కాదు ఇది. మ‌న నాలుగు దిక్కులా ఎల్ల‌వేళ‌లా జ‌రుగుతున్న నిజం. ఆ వాస్త‌వాల‌ను క‌థ‌గా మ‌ల‌చి మేం `బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌`ను తెర‌కెక్కించాం“ అని అంటున్నారు గోపీ గ‌ణేష్ ప‌ట్టాభి. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం `బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌`. శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కులు.

Bluff Master movie

అభిషేక్ ఫిలిమ్స్ అధినేత ర‌మేష్ పిళ్లై నిర్మాత. తమిళంలో ఘనవిజయం సాధించిన `చ‌తురంగ వేట్టై`ని ఆధారంగా చేసుకుని తెలుగులో `బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌`రూపొందింది. `జ్యోతిల‌క్ష్మి`, `ఘాజి` చిత్రాల ఫేమ్ స‌త్య‌దేవ్ హీరోగా నటించారు.`ఎక్క‌డికి పోతావు చిన్నవాడా` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కులకు దగ్గరైన నందితా శ్వేత ఇందులో నాయిక‌.

Bluff Master movie

ద‌ర్శ‌కుడు గోపీ గ‌ణేష్ ప‌ట్టాభి మాట్లాడుతూ “ కొంద‌రు క‌ర‌క్కాయ‌లు అని, ఇంకొంద‌రు ఇరిడియం అని, మ‌రి కొంద‌రు ఎం.ఎల్‌.ఎం అని… నిత్యం మోస‌పుచ్చ‌డానికి ప్ర‌య‌త్నిస్తూనే ఉంటారు. వారి మాయ‌మాట‌లను నిజ‌మ‌ని న‌మ్మ‌డం.. మోస‌పోవ‌డం.. తీరా మోస‌పోయాక‌.. `మోస‌పోయాన్రా` అని న‌లుగురికి చెప్పుకోవ‌డం ఈ స‌మాజంలో ఫ్యాష‌నైపోయింది. అందుకే దాన్నే క‌థా వ‌స్తువుగా తీసుకుని, ప్రతిరూపంగా సినిమాగా తెర‌కెక్కించాం. ఇందులో ఘ‌రానా మోస‌గాడుగా స‌త్య‌దేవ్ త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల అభినంద‌న‌లు పొంద‌డానికి త‌న శ‌క్తిమేర ప్ర‌య‌త్నించాడు“ అని అన్నారు.

Bluff Master movie

చిత్ర నిర్మాత ర‌మేష్ పిళ్లై మాట్లాడుతూ “సినిమా చాలా బాగా వచ్చింది . షూటింగ్ మొత్తం పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అక్టోబ‌ర్‌లో పాట‌ల‌ను విడుద‌ల చేస్తాం. న‌వంబ‌ర్‌లో చిత్రాన్నిప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం“ అని అన్నారు.

న‌టీన‌టులు:సత్యదేవ్, నందిత శ్వేతా, పృథ్వి, బ్ర‌హ్మాజీ, ఆదిత్యామీన‌న్‌, సిజ్జు, చైత‌న్య కృష్ణ‌, జబర్దస్త్ మహేష్, ధ‌న్‌రాజ్‌, వేణుగోపాల‌రావు, ఫిష్ వెంక‌ట్‌, బ‌న్నీ చందు, `దిల్‌` ర‌మేష్‌ త‌దిత‌రులు…సాంకేతిక నిపుణులు :క‌థ‌: హెచ్‌.డి.వినోద్‌, అడిష‌న‌ల్ డైలాగ్స్: పుల‌గం చిన్నారాయ‌ణ‌, సంగీతం: సునీల్ కాశ్య‌ప్‌, ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి, ఆర్ట్: బ్ర‌హ్మ క‌డ‌లి, కెమెరా: దాశరధి శివేంద్ర, కో డైర‌క్ట‌ర్‌: కృష్ణ‌కిశోర్‌, ప్రొడ‌క్ష‌న్ కంట్రోలర్స్: ఆర్‌.సెంథిల్‌, కృష్ణ‌కుమార్‌, సమర్పణ: శివలెంక కృష్ణ ప్రసాద్, నిర్మాత‌: ర‌మేష్ పిళ్లై, మాటలు-ద‌ర్శ‌క‌త్వం: గోపీగ‌ణేష్ ప‌ట్టాభి.

- Advertisement -