బ్లాక్ ఫంగస్‌…లక్షణాలివే!

281
black fungus
- Advertisement -

కరోనా పాజిటివ్ వచ్చి రికవరీ అయిన బాధితుల్లో ఇప్పుడు బ్లాక్ ఫంగస్ దడ పుట్టిస్తోంది. కరోనాను జయించిన ఈ బ్లాక్ ఫంగస్‌ ప్రాణాంతకంగా మారడంతో అందరిలో టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో బ్లాక్‌ ఫంగస్‌పై ఆందోళన వద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

వెంటిలేటర్లను శుభ్రం చేయకుండా ఎక్కువ కాలం వాడటం వల్ల కూడా బ్లాక్‌ ఫంగస్‌ సోకే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు తెలిపారు. ఎక్కువ కాలం ఆక్సిజన్‌పై ఉన్న రోగులకు కూడా ఫంగస్‌ సోకే అవకాశం ఉంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటీ స్టడీలు లేవని వైద్యులు చెబుతున్నారు.

ముఖంలో వాపు ఉన్నప్పుడు లక్షణాలు బయటపడతాయి. కంటిగుడ్డు కింద ఎర్రబడి దురదగా ఉండటం (ఆఫ్తాల్మో ప్లీజియా). ముక్కులో దురదగా ఉండటం, పదేపదే ముక్కును నలిపేయాలనిపించడం. కళ్లపైన లేదా కళ్ల కింద చిన్న ఉబ్బులు కనిపించడం. కంటిచూపు తగ్గినట్టుగా లేదా మసకగా అనిపించడం. దంతాల్లో నొప్పిగా ఉండటం. ముఖంపై నొప్పి, తిమ్మిరి, వాపు వంటితో పాటు మొద్దుబారడం వంటివి కూడా దీని లక్షణాలు. మధుమేహ వ్యాధి ఉన్న వారిపై బ్లాక్ ఫంగస్‌ ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

- Advertisement -