బీజేపీకి షాక్..ఇలా అయితే కష్టమే!

141
bjp
- Advertisement -

ఏపీలో బీజేపీ పరిస్థితి రోజు రోజుకు మరింత దిగజారుతోంది. నిన్న మొన్నటి వరకు జనసేన అండతో ఫుల్ యాక్టివ్ గా ఉన్న కమలనాథులు ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఎందుకంటే మిత్రపక్షంగా భావిస్తున్న జనసేన.. బీజేపీని పక్కన పెట్టి టీడీపీకి దగ్గరవుతుండడం, అదే సమయంలో పార్టీలోని సీనియర్ నేతల మద్య అంతర్గత విభేదాలు బయటపడుతుండడం.. ఇలా పలు కారణాల వల్ల కమలం పార్టీ దిక్కుతోచని స్థితిలో ఉంది. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని కమలనాథులు పదే పదే చెబుతున్నప్పటికి జనసేనాని మాత్రం ఆ వ్యాఖ్యలను కన్ఫర్మ్ చేయడం లేదు..

దీంతో జనసేన అండతో ఏపీలో బలపడాలని చూస్తున్న కమలం పార్టీ ఆశలపై నీళ్ళు చల్లినట్లైంది. అంతే కాకుండా జనసేన టీడీపీకి దగ్గరవుతుండడం కూడా ఆ పార్టీ నేతలకు మింగుడు పడని విషయం. ఈ సమస్యతోనే సతమతమౌతున్న పార్టీలో మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మరియు ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజు మద్య జరుగుతున్న కోల్డ్ వార్ పార్టీని మరింత బలహీన పరుస్తోంది. ఇక పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కన్నా లక్ష్మినారాయణ కమలం పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారట. ఈ వ్యాఖ్యలకు మరింత జీవం పోస్తూ భీమవరంలో నిర్వహిస్తున్న బీజేపీ కార్యవర్గ సమావేశాలకు కన్నా డుమ్మా కొట్టారు.

దీంతో కన్నా లక్ష్మినారాయణ పార్టీ మారడం ఖాయం అనే వాదన బలంగా వినిపిస్తోంది. అంతే కాకుండా ఆయన జనసేన గూటికి చేరబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆయనతో పాటు మరికొంత మంది కమలనాథులు కూడా జనసేన తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారట. దీంతో మిత్రపక్షంగా భావిస్తున్న జనసేనతోనే కమలం పార్టీకి పెను ముప్పు పొంచి ఉందనేది చెప్పక తప్పదు. ఒకవేళ కన్నా లక్ష్మి నారాయణ నిజంగానే బీజేపీని విడితే.. ఆ పార్టీకి గట్టి దేబ్బే అని చెప్పాలి. అసలే బలమైన నాయకులు లేక సతమతం అవుతున్న కాషాయ పార్టీ.. కన్నా లక్ష్మినారాయణ వంటి వారు పార్టీ విడితే ఏపీలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే అవకాశం కూడా ఉంది. మరి ప్రస్తుతం బీజేపీలో జరుగుతున్నా ఈ అంతర్మదనంపై అధిష్టానం ఎలా దృష్టి సారిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

వివేకా కేసు బిగ్ ట్విస్ట్.. నెక్స్ట్ జగనే !

ఫిబ్రవరి 17న సచివాలయ ప్రారంభోత్సవం..

కొండగట్టుకు పవన్‌..

- Advertisement -