బి‌ఆర్‌ఎస్ తో టచ్ లోకి.. షాక్ తప్పదా?

65
- Advertisement -

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో చేరికల హడావిడి కొనసాగుతోంది. కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలలోని చాలమంది నేతలు అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ గూటికి చేరేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం చేరికల విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. బి‌ఆర్‌ఎస్ నుంచి భారీగా చేరికలు ఉంటాయని గాల్లో గీతాలు గీసే ప్రయత్నం చేస్తోంది. నిజానికి కాంగ్రెస్ నుంచి చాలమంది బి‌ఆర్‌ఎస్ లో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్. కాంగ్రెస్ లోని పలువురు మాజీ మంత్రులు పార్టీ విడేందుకు సిద్దంగా ఉన్నారట. ఇటీవల ఎన్నికలే లక్ష్యంగా వేసిన కమిటీలలో చాలమంది మాజీలకు నిరాశే మిగిలింది. దాంతో అసంతృప్త నేతలు బి‌ఆర్‌ఎస్ నేతలతో టచ్ లో ఉంటున్నట్లు టాక్. ఇంకా బీజేపీలో ఎప్పటి నుంచో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

Also Read:పిక్ టాక్: బికినీలో గ్లామర్ విధ్వంసం

ఆ పార్టీని విడేందుకు చాలమంది నేతలు సిద్దంగా ఉన్నారు. పైపైకి పార్టీ వీడే ప్రసక్తే లేదని చెబుతున్నప్పటికి.. లోలోపల బి‌ఆర్‌ఎస్ తో టచ్ ఉంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సరైన సమయంలో అటు బీజేపీ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి ఒక్కసారిగా బి‌ఆర్‌ఎస్ లోకి చేరికలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సారి కూడా జి‌ఆర్‌ఎస్ గెలుపు ఖాయమని ఇప్పటివరకు బయటకు వచ్చిన సర్వేలు కచ్చితమైన రిపోర్ట్స్ ఇస్తున్నాయి. దాంతో ఇతర పార్టీలలో ఉండడం కన్నా.. గెలిచే పార్టీ వైపు వెళితే మేలని చాలమంది నేతలు భావిస్తున్నారట. ఇక ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల విషయంలో అధినేత కే‌సి‌ఆర్ కు సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి పార్టీ ఫిరాయింపు నేతలతో ఎన్నికల ముందు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు గట్టి దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read:కాంగ్రెస్‌ను కూల్చేందుకు కుట్ర..?

- Advertisement -