రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఉనికి లేదని…ఆ పార్టీ ఘోరంగా ఓడిపోవడం ఖాయమని కేంద్రమంత్రి కైలాష్ చౌదరి తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారన్నారు. ఓటమిని కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని, కాంగ్రెస్ నేతలు ప్రచారం కూడా చేయడం లేదని అన్నారు.
సర్వేలు సైతం రాజస్ధాన్‌లో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని…కేంద్ర పధకాలను ఈ ప్రాంతంలో తాను అమలుచేస్తున్నానని తెలిపారు. వైద్య కళాశాలలు ప్రారంభమయ్యాయని, ఎయిర్‌పోర్ట్ ఈ నియోజకవర్గానికి కేటాయించారని, ఎన్నో హైవేలను నిర్మించారని గుర్తు చేశారు. రిఫైనరీ ప్రాజెక్టులపై కసరత్తు సాగుతోందని, రైల్వే స్టేషన్ల నిర్మాణం జరుగుతోందని వివరించారు.
రాజస్ధాన్‌లో 25 ఎంపీ స్ధానాలను బీజేపీ గెలుచుకుంటుందని ..ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని వెల్లడించారు. మోడీపై విశ్వాసం కాషాయ పార్టీకి ఈ ఎన్నికల్లో కలిసివస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read:5 స్థానాల్లో అభ్యర్థుల మార్పు..మరో 2 పెండింగ్!