Kishan Reddy:మూడోసారి అధికారం బీజేపీదే

33
- Advertisement -

కేంద్రంలో మూడోసారి బీజేపీదే అధికారం అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ప్రచార రథాల ప్రారంభోత్సవ సందర్బంగా మాట్లాడన కిషన్ రెడ్డి..‘విజయ సంకల్ప యాత్ర’ పేరుతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రేపటి నుండి రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటిస్తాం అన్నారు. విజయ సంకల్ప యాత్ర ఫిబ్రవరి 20వ తేదీన ప్రారంభమై మార్చి 2వ తేదీన ముగుస్తుందన్నారు.

నరేంద్రమోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. రాబోయే కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం కావాలని…గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో భారతీయ జనతా పార్టీ గత పార్లమెంటు ఎన్నికల్లో 4 స్థానాల్లో విజయం సాధించిందన్నారు.

రాబోయే ఎన్నికల్లో 17 సీట్లు గెలవడమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర చేస్తున్నాం అన్నారు. అన్ని మండలాలు, నియోజకవర్గాల కేంద్రాలలో అన్ని సామాజికవర్గాల ప్రజలతో మమేకమవుతూ, రోడ్ షోలు నిర్వహించుకుంటూ యాత్ర కొనసాగుతుందన్నారు.మార్చి 2వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు పర్యటించే విధంగా కార్యాచరణ రూపొందించుకున్నాం. పార్టీ జెండా నేతృత్వంలోనే యాత్ర జరుగుతుందన్నారు. రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకులందరూ యాత్రలో పాల్గొంటారని తెలిపారు.

రాష్ట్రంలోని యువత, విద్యార్థులు, రైతులు, బడుగుబలహీన వర్గాల ప్రజలందరూ నరేంద్రమోదీ మరొకసారి ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. అందుకోసమే భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చాం అని…హైదరాబాద్ పార్లమెంటు కూడా కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నాం అన్నారు.
త్రిపుల్ తలాక్ రద్దు తర్వాత ముస్లిం మహిళలు నరేంద్రమోదీ నాయకత్వం కోరుకుంటున్నారు….17కు 17 సీట్లు గెలవడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకుంటాం అన్నారు. నరేంద్రమోదీ నాయకత్వంలో సమిష్టిగా పని చేస్తాం…మా జెండా కమలం పువ్వు జెండా,మా నాయకుడు నరేంద్ర మోడీ అన్నారు.
కమలం పువ్వు జెండా పట్టుకుని నరేంద్రమోదీ నాయకత్వంలో విస్తృతంగా ప్రచారం చేస్తాం…భారతీయ జనతా పార్టీని ఆదరించండి.నరేంద్ర మోదీ నాయకత్వానికి ఆశీస్సులు అందజేయాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు.

ALso Read:పార్టీకో ‘వ్యూహ’కర్త సిద్ధం !

- Advertisement -