మరో మూడు రోజులు భారీ వర్షాలు!

210
rains

తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం నుండి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి.

సోమవారం, మంగళవారం, బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారుల సెలవులు రద్దుచేసింది ప్రభుత్వం.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హయత్‌నగర్‌, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, హిమాయత్‌సాగర్‌, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, బాలానగర్‌, దుండిగల్‌, కొంపల్లి, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌, గండిపేట్‌, శంషాబాద్ ప్రాంతాల్లో ఎడతెరపిలేకుండా కురుస్తోంది.