2016/17 సంవత్సరానికి గారు భారతీయ జనతా పార్టీకి విరాళాలు వెల్లువెత్తాయి. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అందుకున్న విరాళాల్లో ఆ పార్టీ టాప్‌గా నిలిచింది. ఏడు జాతీయ పార్టీలకు అజ్ఞాత వ్యక్తుల నుంచి 710 కోట్ల విరాళాలు అందగా బీజేపీ ఏకంగా 532 కోట్లతో నెంబర్ 1గా నిలిచింది. 120 కోట్లతో రెండో స్ధానాంలో కాంగ్రెస్ నిలిచింది.
కార్పొరేట్, వ్యాపార వర్గాల నుంచి బీజేపీకి అధికమొత్తంలో విరాళాలు అందాయి. సత్య ఎలక్ట్రోరల్ ట్రస్ట్ భారతీయ జనతా పార్టీకి ఏకంగా 251.22 కోట్ల రూపాయల విరాళాన్ని ఇవ్వగా ఇదే సంస్థ కాంగ్రెస్ పార్టీకి 13.90 కోట్ల రూపాయల విరాళాన్ని ఇచ్చింది. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) ఈ వివరాలను వెల్లడించింది.
మొత్తం విరాళాల్లో రూ.589.38 కోట్లు రూ.20 వేల కన్నా ఎక్కువ మొత్తాల్లో విరాళాల రూపంలో అందగా, ఇందులో ఒక్క బీజేపీకే 1,194 మంది నుంచి రూ. 532.27 కోట్లు వచ్చాయి. బీఎస్పీకి 20 వేల కంటే ఎక్కువ విరాళాలు ఒక్కరు కూడా ఇవ్వలేదు. ఇక తృణముల్ కాంగ్రెస్ విరాళాల సంఖ్య 231 శాతం ,సీపీఎం 190శాతం,కాంగ్రెస్ పార్టీకి 105 శాతం పెరిగాయి. సీపీఐ పార్టీకి మాత్రం వచ్చే విరాళాల్లో 9 శాతం తగ్గింది. 2015-16లో బీజేపీకి రూ.76.85 కోట్లు విరాళంగా రాగా.. ఈసారి ఏకంగా 500 కోట్లకు చేరుకోవడం విశేషం.