భారత జనతా పార్టీకి సౌత్ లో అసలు ఏ మాత్రం పట్టు లేదు అనే సంగతి ప్రజలకే కాదు.. ఆ పార్టీ పెద్దలు, ఇతర నేతలకు కూడా బాగా తెలుసు. ఇప్పటికీప్పుడు సౌత్ లోని ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిన కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకునే పరిస్థితి లేదు. ఎంతో కొంత కర్నాటకలో కాషాయ పార్టీకి కొంత బలం ఉన్నప్పటికి ఆ మద్య జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో ఉన్న బలం కాస్త బలహీన పడింది. ఇక నార్త్ లో తమకు తిరుగులేదు అని చెప్పుకునే కమలనాథులకు సౌత్ లోని సీనే నార్త్ లో కూడా రిపీట్ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది తెలంగాణతో పాటు మద్య ప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరాం వంటి రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాలలో బీజేపీని ఓటమి భయం వెంటాడుతోందట. సొంత పార్టీ నేతలే ఈ ఐదు రాష్ట్రాలలో ఓటమిని అంగీకరించే పరిస్థితి. .
మద్య ప్రదేశ్, రాజస్తాన్ వంటి రాష్ట్రాలలో కాషాయ పార్టీ రోజు రోజుకు మరింత బలహీన పడుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో ఆ పార్టీ అధిష్టానం వ్యూహాలు సొంత పార్టీ నేతలకే అంతుచిక్కడం లేదు. ఇటీవల మద్యప్రదేశ్ లో 72 మంది అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కి టికెట్ దక్కలేదు. ఇదే ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో హతా టాపిక్ గా మారింది. ఏకంగా సిఎం కె టికెట్ దక్కలేదంటే ఆ పార్టీని ఓటమి భయం ఏ స్థాయిలో వెంటాడుతుందో అర్థం చేసుకోవచ్చు. కాగా అసెంబ్లీ ఎన్నికల బరిలో రాష్ట్ర నేతలను కాకుండా కేంద్ర మంత్రులను, ఎంపిలను బరిలో దించే ఆలోచనలో కాషాయ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read:INDvsAUS:గిల్ లేని లోటు కనిపించిందా?
ఓటమి భయంతోనే కేంద్ర మంత్రులను అసెంబ్లీ ఎన్నికల బరిలో దించుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మద్య ప్రదేశ్ లో ముగ్గురు కేంద్ర మంత్రులు, ఏడుగురు ఎంపీలకు అసెంబ్లీ సీట్లు కేటాయించింది బీజేపీ అధిస్థానం. ఇక తెలంగాణ ఛత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాలలో కూడా కేంద్ర నేతలకీ అధిక ప్రదాన్యం ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ విషయానికొస్తే బరిలో నిలిచే అభ్యర్థుల కొరత తీవ్రంగా ఉండడంతో కేంద్ర సభ్యులతో భర్తీ చేయాలని చూస్తోంది. బండి సంజయ్, కిషన్ రెడ్డి, దర్మపురి అరవింద్ వంటి వారు గత ఎన్నికల్లో పార్లమెంట్ బరిలో నిలిచారు. కానీ ఈసారి అభ్యర్థుల కొరత కారణంగా ఈసారి వీరిని అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిపేందుకు బీజేపీ సిద్దమౌతోంది. మొత్తానికి అటు నార్త్ లోనూ ఇటు సౌత్ లోనూ బీజేపీకి గడ్డుకాలం కాలం ఎదురవుతోందనే చెప్పాలి.
Also Read:పెదకాపు-1..అందరినీ అలరిస్తుంది