ప్రభాస్ vs షారుక్.. క్రిస్మస్ ఫైట్ ?

19
- Advertisement -

గత కొన్నాళ్లుగా బాలీవుడ్ లో కూడా సౌత్ సినిమాల హవా కొనసాగుతుండడంతో.. అక్కడి డైరెక్ట్ హింధీ సినిమాలు ఆశించినంత స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయాయి. దీంతో బాలీవుడ్ పనైపోయిందనే కామెంట్స్ గట్టిగా వినిపించాయి. అయితే పూర్తిగా పతనమైన బాలీవుడ్ ను కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ ఒంటి చేత్తో నిలబెట్టాడు. పఠాన్, జవాన్ మూవీస్ బ్యాక్ టూ బ్యాక్ వరుసగా 1000 కోట్లు సాధించడంతో బాలీవుడ్ ఊపిరి పిల్చుకుంది. .

ఇక ఇదే ఏడాది మరో సినిమాను కూడా రిలీజ్ చేసి మరో వెయ్యి కోట్ల సినిమాపై కన్నెశాడు కింగ్ ఖాన్ షారుక్. ప్రస్తుతం ఆయన డంకి అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ పైన మంచి అంచనాలు ఉన్నాయి ఎందుకంటే అపజయమే ఎరుగని రాజ్ కుమార్ హీరాణి ఈ మూవీకి దర్శకుడు కావడంతో షారుక్ ఖాతాలో మరో వెయ్యి కోట్ల మూవీ పక్కా అనే అభిప్రాయాలూ వ్యక్తమౌతున్నాయి. ఈ మూవీని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల చేసేందుకు చిత్రా యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

అయితే షారుక్ ఖాన్ ను షాక్ ఇస్తూ ఇండియన్ బాక్సాఫీస్ బాద్షా ప్రభాస్ కూడా క్రిస్మస్ బరిలో దిగబోతున్నాట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 28 రిలీజ్ కావల్సిన ప్రభాస్ సలార్ మూవీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఇండియన్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ మూవీని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22ననే విడుదల చేయాలని భావిస్తోందట చిత్రా యూనిట్. ఇదే గనుక నిజం అయితే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బాక్సాఫీస్ క్లాష్ ఏర్పడే అవకాశం ఉంది. ప్రభాస్ సలార్.. అలాగే షారుక్ డంకి రెండు కూడా భారీ క్రేజ్ ఉన్న మూవీస్ కావడంతో నేవర్ బిఫోర్ క్లాష్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగానే ప్రభాస్ సలార్ క్రిస్మస్ బరిలో దిగుతుందేమో చూడాలి.

Also Read:పిక్ టాక్ : కుర్ర భామ అందాల గిలిగింతలు

- Advertisement -