ఎన్టీఆర్ తో బీజేపీకేం పని?

36
- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాల్లో పట్టు కోసం బీజేపీ వ్యూహాలకు పదును పెడుతోందా ? అందుకోసం సినీ మంత్రాన్ని జపిస్తోందా ? రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం కోసం జూ. ఎన్టీఆర్ తో మంతనాలు చేసేందుకు సిద్దమౌతోందా ? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. తెలంగాణలో ఈ నెల చివర్లో ఎన్నికలు జరగనున్నప్పటికి పార్టీలో మాత్రం ఎలాంటి హడావిడి కనబడడంలేదు. ఎందుకంటే అంతర్గత కుమ్ములాటలు, నేతల మద్య విభేదాలతో కాషాయ పార్టీ సతమతమౌతోంది. పైగా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు కూడా బలమైన నేతలు కాకపోవడం ఆ పార్టీని వేధిస్తున్న అంశం. .

అటు ఏపీ విషయానికొస్తే జనసేనతో దోస్తీ మినహాయిస్తే అసలు పార్టీ ఉందనే విషయం కూడా గుర్తించడం కష్టం. ఈ నేపథ్యంలో పార్టీ బలపరచడం అంతా తేలికైన విషయం కాదు. దాంతో రెండు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం కోసం జూ. ఎన్టీఆర్ ను లైన్లో పెడితే ఎలా ఉంటుందనే దానిపై కమలనాథులు కసరత్తులు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా కాషాయ పార్టీ పెద్దలు ఎన్టీఆర్ తో టచ్ లో ఉంటున్నారు. ఆ మద్య మునుగోడు ఎన్నికల సమయంలో కూడా ఎన్టీఆర్ తో ప్రచారం చేయించేందుకు తెగ ప్రయత్నించి విఫలం అయ్యారు. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ తో చర్చలు జరిపేందుకు సిద్దమౌతున్నారట కమలనాథులు.

త్వరలోనే ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్. అయితే సినీ గ్లామర్ విషయానికొస్తే ఆల్రెడీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. మరి ఆయన ద్వారా ప్రచారం చేయించకుండా జూ. ఎన్టీఆర్ వైపు బీజేపీ ఎందుకు చూస్తోందనే డౌట్ రాక మానదు. సినీ తారల్లో పవన్ తరువాత రాజకీయాలపై అనర్గళంగా మాట్లాడే సత్తా ఎన్టీఆర్ సొంతం. 2019 ఎన్నికల టైమ్ టీడీపీ తరుపున ఎన్టీఆర్ ప్రచారం ఏ స్థాయిలో సంచలనం అయిందో విధితమే. పైగా ఇప్పుడు ఎన్టీఆర్ టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ను ఎలాగైనా బీజేపీ తరుపున ప్రచారం చేయించాలనేది కమలనాథుల ప్లాన్. మరి బీజేపీ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Also Read:విజువల్ ట్రీట్‌లా షారుఖ్..డంకీ!

- Advertisement -