‘భారతీయుడు-2’లో ఆ నటులు కూడా

24
- Advertisement -

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇండియన్-2. తాజాగా ఈ సినిమా నుంచి పలు భాషల్లో ఇంట్రో వీడియో విడుదల చేసింది మూవీ టీమ్. ఈ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘భారతీయుడు-2’ ఇంట్రో టీజర్ తెలుగులో కూడా విడుదలైంది. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి తెలుగు వీడియోను అభిమానులకు షేర్ చేశారు. ఇందులో గత సినిమాని గుర్తుచేస్తూ `ఏ తప్పు జరిగినా నేను తప్పకుండా వస్తాను.. భారతీయుడికి చావే లేదు` అనే కమల్‌ డైలాగ్‌తో ప్రారంభమైంది. ఈ ఇంట్రోలో శంకర్ స్టాండర్డ్ విజువల్స్ కనిపించాయి.

అయితే, అందులో 2021 ఏప్రిల్‌ 17న మృతి చెందిన వివేక్, ఈ ఏడాది మే 3న మరణించిన మనోబాల సన్నివేశాలు కూడా ఉన్నాయి. అవి చూసిన అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు. కాగా, వారికి సంబంధించిన సన్నివేశాలు తొలగించలేదని మూవీ టీమ్ పేర్కొంది. వీరి సన్నివేశాలు సినిమాలో చాలా కీలకంగా ఉంటాయట. అందుకే, వారి పాత్రలకు డబ్బింగ్ ను మిమిక్రీ ఆర్టిస్ట్ ల చేత చెప్పించారట. వివేక్ – మనోబాల భౌతికంగా లేకపోయినా వారు నటించిన పాత్రలు మాత్రం ఇంకా ప్రజల్లో ఉండటం విశేషం.

ఇక కమలహాసన్, శంకర్ కాంబినేషన్ లో 1996లో వచ్చిన బ్లాక్ బస్టర్ భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఇండియన్-2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఇండియన్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read:విజువల్ ట్రీట్‌లా షారుఖ్..డంకీ!

- Advertisement -