లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ టార్గెట్.. ఎంతంటే?

17
- Advertisement -

మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. గతంలో మాదిరి ఈసారి ఎన్నికల్లో కూడా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారం కోసం గట్టిగానే పోటీ పడుతున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలో ఉన్న బీజేపీ.. మూడోసారి కూడా అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతుంటే.. ఈసారి బీజేపీని ఎలాగైనా గద్దె దించాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంచితే గత ఎన్నికల్లో 300 కు పైగా సీట్లు సాధించిన బీజేపీ ఈసారి అంతకు మించి అనేలా వ్యూహాలు రచిస్తోంది. .

గత ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు సాధించగా, ఎన్డీయే కూటమిలో భాగంగా మరో 50 సీట్లు సొంతం చేసుకుంది. ఓవరాల్ గా గత ఎన్నికల్లో 353 సీట్లు బీజేపీ సొంతం చేసుకోగలిగింది. దాంతో ఈసారి ఏకంగా 400 పైగా స్థానాల్లో విజయం సాధించాలని కమలనాథులు టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీలకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా అన్నీ స్థానాల్లో కూడా బీజేపీ ఆధిపత్యం కొనసాగాలని పార్టీ పెద్దలు ప్రణాళికలు రచిస్తున్నారట. అయితే నార్త్ లో కమలం పార్టీకి తిరుగు లేనప్పటికి సౌత్ లో మాత్రం పార్టీకి ప్రతికూలతే ఎదురవుతోంది. ఒక్క కర్ణాటక మినహా మిగిలిన దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి ఏమాత్రం బలం లేదు.

ఆ మధ్య జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కూడా ఓడిపోవడంతో ప్రస్తుతం దక్షిణాదిన బీజేపీ చేతిలో ఏ రాష్ట్రం కూడా లేదు. దక్షిణాదిన అన్నీ రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాల లోక్ సభ స్థానాలు కలిపితే 133 సీట్లు ఉంటాయి. మరి ఇన్ని స్థానాల్లో సత్తా చాటలంటే కమలం పార్టీకి అంతా సులువైన విషయం కాదు. ఎందుకంటే దక్షిణాదిన ప్రాంతీయ పార్టీల హవా గట్టిగా నడుస్తుంది. అందువల్ల 400 సీట్లు సాధించాలంటే దక్షిణాదిన కచ్చితంగా సత్తా చాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ప్రస్తుతం పార్టీ అగ్రనేతలు కూడా దక్షిణాది పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. మరి కమలనాథులు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారా ? లేదా వారి వ్యూహాలన్నీ బెడిసి కొడతాయా అనేది చూడాలి.

Also Read:పిక్ టాక్ : హాట్ షూట్స్ తో మెస్మరైజింగ్ ఫోజులు

- Advertisement -