“బండి”కి బీజేపీ స్ట్రోక్..?

39
- Advertisement -

తెలంగాణలో బీజేపీ పరిస్థితి గందరగోళంగా ఉంది. కర్నాటక ఎన్నికలకు ముందు తెలంగాణలో విజయం మాదే.. అధికారం మాదే అని జబ్బలు జరిచిన కమలం పార్టీకి ఆ రాష్ట్ర ప్రజలు ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. దాంతో తెలంగాణలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందా అనే భయంలో కమలనాథులు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి ? ఏం నిర్ణయాలు తీసుకోవాలి అనే దానిపై ఎటు తేల్చుకోలేకపోతుంది బీజేపీ అధిష్టానం.

గత కొన్నాళ్లుగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి మార్పు పై చర్చ జరుగుతోంది. బండి సంజయ్ ని తప్పించి అతని ష్టానంలో వేరొకరికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. బండి సంజయ్ కారణంగా పార్టీకి మైలేజ్ పెరగడం సంగతి అటుంచితే.. ఎక్కువగా విమర్శలు, వ్యతిరేకతనే ఏర్పడుతోందనే భయం అధిష్టానంలో ఉందట. ఎందుకంటే బండి సంజయ్ వ్యవహార శైలి, పలు సందర్భాల్లో కంట్రోల్ తప్పి ఆయన చేసే వ్యాఖ్యలు పార్టీని చిక్కుల్లోకి నేడుతున్నాయి.

Also Read:పన్నీరు తింటే ఎన్ని ప్రయోజనాలో..!

దీంతో బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో ఈటెల రాజేందర్ లేదా కిషన్ రెడ్డి వంటి వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు తాజాగా వినబడుతున్న టాక్ ఏమిటంటే సి‌ఎం అభ్యర్థిగా కూడా బండి ని పక్కన పెట్టె ఆలోచనలో అధిష్టానం ఉందట. బండిని సి‌ఎం అభ్యర్థిగా ప్రకటిస్తే బీజేపీ ఓటు బ్యాంక్ లో భారీగా చీలిక వచ్చే అవకాశం ఉందనే భయం కాషాయ పార్టీ పెద్దలను వెంటాడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఒకవేళ అధ్యక్ష పదవిలో బండి సంజయ్ నే ఉంచితే సి‌ఎం అభ్యర్థిగా వేరే వ్యక్తి పేరు పరిశీలించేందుకు బీజేపీ అధిష్టానం ప్రయత్నిస్తోందట. అదే గనుక జరిగితే సి‌ఎం కావాలని బండి సంజయ్ కంటున్న కలలు.. పగటి కలలుగానే మిగిలిపోయే అవకాశం ఉంది. మొత్తానికి బీజేపీలోని తాజా పరిస్థితులు చూస్తుంటే అధిష్టానం ఏదో ఒక రకంగా బండి సంజయ్ కి షాక్ ఇచ్చేలాగే కనిపిస్తోంది.

Also Read:తెలంగాణపై ఎందుకీ వివక్ష.. మోడీజీ?

- Advertisement -