బీజేపీ బూత్ కార్యకర్తల సభ..అట్టర్ ప్లాప్..!

116
modi new
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీకి ఘోర అవమానం ఎదురైంది. యుపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. ఇప్పటికే ముగిసిన 5 విడతల పోలింగ్‌లో యోగి సారథ్యంలోని బీజేపీ పూర్తిగా వెనుకబడిపోయింది. దీంతో ప్రధాని మోదీ డైరెక్ట్‌గా రంగంలోకి దిగి జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే తాజాగా సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత పార్లమెంటు నియోజకవర్గమైన వారణాసిలో నిర్వహించిన బీజేపీ బూత్ కార్యకర్తల సదస్సు వెలవెలబోయింది.

వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగిన బూత్ విజయ్ సమ్మేళన్ సభలో బీజేపీ కార్యకర్తలు లేక కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. వారణాసిలోని మొత్తం 3361 బూత్‌ల నుంచి 20వేల మంది బీజేపీ కార్యకర్తలు పాల్గొనాల్సి ఉంది. కాగా మోదీ ఆలస్యంగా రావడంతో బీజేపీ కార్యకర్తలు సభా ప్రాంగణం నుంచి నుంచి వెళ్లిపోయారు. కార్యకర్తలు వెళ్లిపోవడంతో కుర్చీలు ఖాళీగా కనిపించాయి. ప్రధాని మోదీ వచ్చి ప్రచార రథంలో ఖాళీ కుర్చీలకు చేయూ ఊపుతూ వెళ్లారు. అనంతరం ఉన్న కొద్దిపాటి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

ప్రధాని ప్రసంగం సమయంలో బీజేపీ ఓబీసీ ఫ్రంట్ అధ్యక్షుడు సోమనాథ్ మౌర్య కూడా వెళ్లిపోయారు. వేదిక నుంచి బీజేపీ కార్యకర్తలు వెళ్లిపోవడానికి గల కారణంపై సోమ్‌నాథ్‌ను అడగ్గా.. మధ్యాహ్నం నుంచి కార్యకర్తలు, ప్రజలు వేదిక వద్ద వేచి ఉన్నారని చెప్పారు. అందరూ ఆకలితో, దాహంతో ఉన్నారు. చాలా మంది బహిర్భూమికి వెళ్లారు. ఖాళీగా ఉన్న కుర్చీల్లోకి కార్యకర్తలు తిరిగి వస్తారని బీజేపీ నేత సోమనాథ్ చెప్పుకొచ్చారు..మోదీ సభ నుంచి బీజేపీ మండల అధ్యక్షురాలు మోనికా పాండే కూడా వెళ్లిపోయారు. దీనిపై ప్రశ్నించగా తన కుమార్తెకు పరీక్ష ఉందని, తాను మోదీ సభకు మళ్లీ వస్తానని మోనికా చెప్పారు. ప్రధాని మోదీ సభలో కనిపించిన ఖాళీ కుర్చీలు చాలు యుపీలో బీజేపీ చిత్తుగా ఓడిపోతుందని చెప్పడానికి అంటూ సమాజ్‌వాదీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నారు. కాగా సొంత నియోజకవర్గంలో అదీ బీజేపీ కార్యకర్తల సభలో ఖాళీ కుర్చీలు కనిపించడంతో ప్రధాని మోదీ షాక్ అయ్యారని, స్థానిక నేతలపై చిందులు వేసి ఢిల్లీకి అవమానభారంతో వెళ్లిపోయారని తెలుస్తోంది. మొత్తంగా యూపీ ఎన్నికల పోలింగుకు ముందు వారణాసిలో జరిగిన బీజేపీ కార్యకర్తల సభ వెలవెలబోవడం రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

- Advertisement -