బీజేపీ మాస్టర్ ప్లాన్..ముక్కలవనున్న కాంగ్రెస్ పార్టీ…!

40
modi pm
- Advertisement -

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చేందుకు ప్రధాని మోదీ ప్లాన్ వేశారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని చీల్చేందుకు మోదీ, అమిత్‌షాలు కుట్రలు చేస్తున్నారు. జాతీయ కాంగ్రెస్‌లో గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా జీ – 23 పేరుతో సీనియర్లు తిరుగుబాటు చేయనున్నారా…కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టేందుకు గులాం నబీ ఆజాద్‌ను పావుగా బీజేపీకి వాడుకుంటుందా..ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే…5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోవడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటుననారు.

యూపీలో బీజేపీ, ఎస్పీల మధ్య గట్టిపోటీ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్‌ ఘోర పరాజయం చవిచూడబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇక పంజాబ్‌లో అధికారం కోల్పోయి రెండోస్థానానికి పరిమితం కానున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గోవా, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌కు గెలిచే అవకాశాలే లేవంటున్నారు. మణిపూర్‌లో కొన్ని ఆశలున్నప్పటికీ.. ఇతర పార్టీలు ఏ మేరకు సహకరిస్తాయన్నది అనుమానమే అని చెప్పాలి.. ఈ నేపథ్యంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం ఎదుర్కోనుంది. అయితే ఫలితాలు వెలువడిన అనంతరం కాంగ్రెస్‌ అధినాయకత్వంపై తిరుగుబాటుకు సీనియర్‌ నేతలు సంసిద్ధులవుతున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.

సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు గులాంనబీ ఆజాద్‌ ఇంట్లో పలువురు సీనియర్‌ నేతలు సమావేశమై ఇందుకు సంబంధించి వ్యూహరచన చేసినట్టు తెలిసింది. గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి మాధవ్‌సింహ్‌ సోలంకీ కుమారుడు భరత్‌సింహ్‌ సోలంకీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌సింగ్‌ హుడాతో పాటు సీనియర్‌ నేతలు కపిల్‌సిబల్‌, ఆనంద్‌శర్మ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నట్టు సమాచారం. వీరంతా 2020 ఆగస్టులో జీ23 పేరుతో కాంగ్రెస్‌ పార్టీలో సంస్థాగత మార్పులు కావాలంటూ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖాస్త్రాన్ని సంధించినవారే. ఇటీవలి కాలంలో రాహుల్‌గాంధీ క్రమంగా బలపడుతున్నారు.

పార్లమెంట్‌లో ప్రధానమంత్రిపైన, బీజేపీ నాయకత్వంపైన.. రాహుల్‌ విరుచుకుపడిన ప్రసంగం దేశమంతా వైరల్‌గా మారింది. ఈ క్రమంలో సోనియా, రాహుల్‌ నాయకత్వాన్ని బలహీనపరచడం లక్ష్యంగా కాంగ్రెస్‌లోని సీనియర్ల సహాయాన్ని తీసుకొని బీజేపీ నాయకత్వమే పావులు కదుపుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గులాంనబీ ఆజాద్‌ను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్‌ పార్టీని చీల్చడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహా రచన చేసిందని టాక్ నడుస్తోంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆజాద్ నాయకత్వంలో కాంగ్రెస్ సీనియర్ల గ్రూపు గాంధీ కుటుంబం నుంచి కాంగ్రెస్ నాయకత్వాన్ని మరొక సమర్థుడైన నాయకుడికి అప్పగించాలంటూ తిరుగుబాటు చేసే అవకాశం ఉందని..కాంగ్రెస్‌తో విడిపోయి నయా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుకు సీనియర్లు ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలితే…తెలంగాణలో కూడా సీనియర్లు రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేయడం ఖాయమని, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోవడం పక్కా అని గాంధీభవన్‌లో చర్చ జరుగుతోంది. మరి గులాం నబీ ఆజాద్‌ను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్‌ ను చీల్చాలన్న మోదీ ఎత్తులు ఫలిస్తాయో లేదో చూడాలి.

- Advertisement -