మనం మాట్లాడే విధానాన్ని బట్టి మన మనసు ఎలాంటిదో తెలుస్తుంది. అందుకే మాట తూటా వంటిది అని అంటూ ఉంటారు. అందుకే మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలని పెద్దలు సూచిస్తుంటారు. అయితే రాజకీయాల్లో మాత్రం ఇవేవీ లెక్కలోకి రావు.. ఇష్టం వచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం, అసత్య ప్రచారాలు చేయడం, చెడు మాటలకు జీవం పోయడం.. ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే రాజకీయ నాయకులు పాటించి కంపరమైన విధానాలకు కొదువే ఉండదు. ప్రజశ్రేయస్సు కోసం పని చేయాల్సిన ప్రజాప్రతినిధులు ప్రజలను తప్పుడు మార్గంలో నడిపించడానికి నాంది పలుకుతున్నారు. దాంతో స్వచ్చమైన రాజకీయల్కు కొరత ఏర్పడిందనే చెప్పాలి. తమను తాము హెచ్చించుకోవడం కోసం ఎదుటివారిని కించపరచడం రాజకీయాల్లో షరా మామూలు అయిపోయింది.
ముఖ్యంగా బీజేపీ నేతలు మాట్లాడే మాటలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కేంద్రంలో అధికారపు అండ చూసుకొని రాష్ట్ర నేతలు పెట్రేగిపోతున్నారు. తాజాగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఎమ్మెల్సీ కవిత పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. డిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను అక్రమంగా ఇరికెంచే ప్రయత్నం మోడి సర్కార్ చేస్తదనే సంగతి అందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలో ” కవిత ను అరెస్ట్ చేయకుండా.. ముద్దు పెట్టుకుంటారా ” అంటూ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు.. మహిళల పట్ల బీజేపీ నేతల వైఖరి ఎలా ఉంటుందో చెప్పకనే చెబుతున్నాయి. మహిళల పట్ల ఏ మాత్రం గౌరవం వహించని బండి సంజయ్ పై కఠినంగా చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బండి సంజయ్ చాలా సందర్భాల్లో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. మతాల మద్య చిచ్చు పెట్టెలా మాట్లాడడం, మహిళలను కించపరుస్తూ మాట్లాడడం బండి సంజయ్ మనస్తత్వాన్ని సూచిస్తున్నాయి. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటూ పోలిటిక్స్ ను బ్రష్టు పట్టిస్తున్నారని, ఇలాంటి వాళ్ళను ప్రజలు ఏ మాత్రం నమ్మరాదని రాజకీయవాదులు చెబుతున్నారు.
Women react on BJP President Bandi Sanjay’s vulgar remarks on Smt.Kavitha garu… pic.twitter.com/Yj9zN0MohP
— Krishank (@Krishank_BRS) March 11, 2023
ఇవి కూడా చదవండి…