రాందేవ్‌కు బీజేపీ ఎంపీ వార్నింగ్…

170
pathanjali
- Advertisement -

పతాంజలి సంస్థల అధినేత, యోగా గురు రాందేవ్ బాబాపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. రాందేవ్ తన సంస్థలకు పతాంజలి పేరును తొలగించాలని లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతానని తెలిపారు. రాందేవ్ తన సొంతపేరుతో బ్రాండ్ నిర్మించుకోవాలని…లేకుంటే న్యాయపరమైన చర్యలకు దిగేందుకు వెనుకాడనని తెలిపారు.

రామ్‌దేవ్ వారి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటంలో తమకేమీ అభ్యంతరం లేదని కానీ పతాంజలి పేరుమీద నెయ్యి, నూనె, సబ్బు, మసాలాలు, లోదుస్తులు, ప్యాంటు వ్యాపారం చేయడం సరికాదన్నారు. పతంజలి పేరును వారి వ్యాపార సంస్థకు తీసివేయాలని, పేరుమార్చకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -