సన్నీకి ఈసీ నోటీసులు..

270
BJP MP Sunny Deol
- Advertisement -

నటుడు, బీజేపీ ఎంపీ సన్నీ డియోల్‌కు ఈసీ నోటీసులు ఇచ్చింది. ఎన్నికల‌ ఖర్చు విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని సన్నీ డియోల్‌పై ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. నిర్దేశించిన ప్రచార ఖర్చుకంటే అధికంగా డబ్బు‌ఖర్చు చేశారని.. ఎంపీ అభ్యర్థిగా 70 లక్షలు ఖర్చు చేయాలని నిబంధనలు ఉండగా 86 లక్షలు ఖర్చు చేశారని సన్నీడియోల్‌పై ఈసీకి‌ ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో ఎన్నికల‌ ఖర్చులపై వివరణ ఇవ్వాలని సన్నీడియోల్‌ను ఆదేశించింది ఈసీ. అధికంగా ఖర్చు చేశారని తేలితే సభ్యత్వం రద్దు చేసే అవకాశం ఉందని వెల్లడించారు.

BJP MP Sunny Deol

ఇటీవల జరిగిన ఎన్నికల్లో సన్నీ డియోల్ గురుదాస్‌పూర్ నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సునీల్ పోటీ చేసి.. ఓడిపోయారు. సునీల్‌పై సన్నీ డియోల్ 80 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ లోక్‌సభ ఎన్నికల్లో రూ.70 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు చేయొద్దని అభ్యర్థులకు ఈసీ ముందుగానే స్పష్టం చేసింది. కానీ అప్పుడే రాజకీయాల్లో చేరి గురుదాస్‌పూర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సన్నీ డియోల్ ఈ అంశాలును మరిచినట్లున్నాడు. అందుకే ఆయన ఇబ్బడి ముబ్బడి డబ్బులు ఖర్చుచేసి.. ఏరీ కోరీ మరీ కష్టాలు తెచ్చుకున్నారు.

- Advertisement -