బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీలోని పాత సామాను బయటకు పోవాలని సెన్సేషనల్ కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొమ్మిదో నిజాం లాగా వ్యవహరిస్తున్నారని…. హిందువులు పండగలు ఎలా చేసుకోవాలో రేవంత్ చెబుతారా? అని ప్రశ్నించారు.
అలాగే బీజేపీ అధికారంలోకి రావాలంటే తెలంగాణ బీజేపీ నుంచి పాత సామాను బయటకు వెళ్లిపోవాలి అని… పార్టీ కేంద్ర పెద్దలు దీనిపై ఆలోచన చేయాలని రాజాసింగ్ సూచించారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చినా ముఖ్యమంత్రితో కొందరు సీక్రెట్ మీటింగ్ లు పెట్టుకుంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది నా పార్టీ.. నా అయ్య పార్టీ అనేటోళ్లు తెలంగాణ బీజేపీలో చాలా మంది ఉన్నారు. వాళ్లకు రిటైర్మెంట్ ఇస్తే తెలంగాణలో బీజేపీకి మంచి రోజులు వస్తాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క బీజేపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు ఇదే అనుకుంటున్నారని చెప్పగా రాజాసింగ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Also Read:సీఎం రేవంత్ రెడ్డికి స్టాలిన్ ఆహ్వానం

